విశాఖ

పెరిగి, తగ్గుతున్న బెల్లం ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, అక్టోబర్ 17: బెల్లం మార్కెట్ సీజన్ క్రమేపీ ఊపందుకుంటుంది. ఈ సీజన్‌లో ఎన్నడూ లేని విధంగా సోమవారం పదికిలోల బెల్లం 470 రూపాయల ధర పలికింది. మరుసటిరోజు మంగళవారం ఒకేసారి 20 రూపాయల ధర తగ్గిపోయింది. దీపావళి పండుగ సీజన్ ముగియనుండడమే ఇందు కు ప్రధాన కారణం. ప్రతీయేటా సహజంగానే దీపావళి పండుగకు బెల్లం ధరలు పెరుగుతుంటాయి. అదేవిధంగా ఈ ఏడాది కూడా బెల్లం ధరలు నింగినంటాయి. దీంతో ఇటు రైతులు, అటు వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం అనకాపల్లి మార్కెట్‌కు 3800 దిమ్మల బెల్లం వచ్చింది. మరుసటి రోజు మంగళవారం రెండువేల దిమ్మలు మాత్రమే వచ్చాయి. దీపావళి పండుగ సీజన్ కావడం, తుపాను ప్రభావం వలన బెల్లం తయారీ కొన్ని ప్రాంతాల్లో స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పంటభూముల్లో వర్షపునీరు తగ్గకపోవడం కూడా బెల్లం తయారీ ఆశించిన మేరకు జరగకపోవడానికి మరో ప్రధాన కారణం. ప్రస్తుతం ఇక్కడ మార్కెట్‌కు వస్తున్న బెల్లం స్థానిక అవసరాలకే తరలిపోతుంది. దీపావళి పండుగకు పిండివంటల్లో బెల్లాన్ని వినియోగిస్తారు. నాగులచవితికి కూడా చిమ్మిడి ఇతర పిండివంటల తయారీలో విధిగా బెల్లాన్ని వినియోగిస్తుంటారు. దీంతో గ్రామాలతోపాటు పట్టణాల్లో సైతం బెల్లానికి మంచి డిమాండ్ ఉంటుంది. దీపావళి పండుగ ముగిసాక ప్రస్తుతం పలుకుతున్న ధరలు మరింత తగ్గిపోయే పరిస్థితులున్నాయని వ్యాపారులు
అంటున్నారు. గతయేడాదితో పోలిస్తే బెల్లం ఉత్పత్తి కూడా ఈ సీజన్‌లో అనూహ్యంగా తగ్గిపోవచ్చునని భావిస్తున్నారు. సాగుఖర్చులు పెరిగిపోవడం, చెరకుకు రెడ్‌రాడ్ తెగుళ్లు సోకడం, ధరలు నిరాశాజనకంగా ఉండటం తదితర ప్రతికూల పరిస్థితుల వలన చెరకు సాగుపట్ల రైతుల్లో క్రమేపీ నిరాశక్తత వ్యక్తమవుతోంది. కేవలం బెల్లం తయారీపైనే ఆధారపడి చెరకు సాగుచేసే మునగపాక, అనకాపల్లి, కశింకోట, చోడవరం తదితర ప్రాంతాల్లో సైతం చెరకు సాగువిస్తీర్ణం గడచిన సీజన్‌లో బాగా తగ్గిపోయింది. చెరకుకు ప్రత్యామ్నాయంగా సరుగుడు, సుబాబుల్, వరి తదితర ప్రత్యామ్నాయ పంటలు వేసారు. పెరిగిన సాగు ఖర్చులు ప్రభావం వలన పదికిలోల బెల్లం ధరలు 350నుండి 400 రూపాయల వరకు పలికితే తప్ప గిట్టుబాటయ్యే పరిస్థితి లేదు. సుగర్ ప్యాక్టరీలు తిరిగితే బెల్లానికి డిమాండ్ మరింత పెరగవచ్చు. అయితే ఇతర రాష్ట్రాల్లోన్ని మార్కెట్‌లకు వచ్చే బెల్లాన్ని బట్టీ కూడా అనకాపల్లి మార్కెట్‌లో పలికే ధరలపై ప్రభావం చూపనుంది. ఈ సీజన్‌లోనైనా రైతులు గిట్టుబాటు ధరలు లభించకపోతే చెరకు సాగు విస్తీర్ణం వచ్చే సీజన్‌లో మరింత బాగా తగ్గిపోయే పరిస్థితి ఉంది.