విశాఖ

అవగాహన తోనే గిరిజనుల్లో ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 20: ప్రభుత్వాలు అందించే పథకాలపై సరైన అవగాహన కల్పించడం ద్వారా గిరిజనుల ప్రగతికి దారిచూపాలని ఎయు విసి ప్రొఫెసర్ జి నాగేశ్వర రావు అన్నారు. ఎయు ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ఎంపిలో గిరిజనుల అభివృద్ధిపై ఏర్పాటు చేసిన రెండు రోజుల మేథో సదస్సును శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సదస్సులు పథకాల ప్రతిపాదనలో ప్రభుత్వాలకు సహకారం అందిస్తాయన్నారు. గిరిజనుల వికాసానికి ఏర్పాటు చేసిన పథకాలను వీరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారన్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉంటోందన్నారు. సంప్రదాయాలు, కట్టుబాట్లు కూడా కొంతమేర గిరిజనుల అభివృద్ధికి అవరోంధంగా నిలుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో గిరిజనుల్లో వైవిద్యం ఉందని, ఎయు కేంద్రంగా వీరిపై అధ్యయనం జరపడం మంచి పరిణామంగా పేర్కొన్నారు. సిఇఎస్‌ఎస్ సంచాలకులు ఎస్ గాలబ్ మాట్లాడుతూ గిరిజనుల సమస్యలు, అభివృద్ధి ప్రయత్నంగా మేథో మథనం జరుగుతోందన్నారు. జనాభా ప్రాతిపదికన వనరుల కేటాయింపు, సబ్‌ప్లాన్ ఎలా తయారు చేయాలి, దీనికి ప్రాతిపదిక, స్వరూపానికి అవసరమైన సూచనలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. సబ్‌ప్లాన్ రూపకల్పనకు అవసరమైన వౌలిక సమాచారం అందించడం దళితులు, గిరిజనుల సమస్యలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రస్పుటం చేసే విధంగా అధ్యయనం జరుగుతోందన్నారు. సిఇఎస్‌ఎస్ చైర్మన్, ఎయు మాజీ విసి ఆచార్య ఆర్ రాధాకృష్ణ మాట్లాడుతూ భారతదేశంలో 400 గిరిజన కులాలు ఉన్నాయన్నారు. మధ్య ఈశాన్య భారతావనిలో వీరు అధికంగా ఉంటున్నారని, వీరి వైవిధ్యత, అసాధారణమైన నివాసాలు, తీవ్రమైన పేదరికం వంటివి అభివృద్ధికి అవరోధాలుగా నిలుస్తున్నాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో చేపడుతున్న పథకాలు ఆదివాసీల స్థాన భ్రంశానికి దారితీస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఎయు ఆచార్యులు ఎం సుందరరావు,పి విజయ్ ప్రకాష్, ఆర సుదర్శన రావు, తిమ్మారెడ్డి, డి పుల్లారావు, టి కోటేశ్వర రావు, గంగాధర రావు, తదితరులతో పాటు స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.