విశాఖ

పోలీసుల నిర్భంధంలో గిరిజనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, అక్టోబర్ 21: గూడెంకొత్తవీధి మండలం దారకొండలో సెల్ టవర్‌ను మావోయిస్టులు దగ్ధం చేసిన ఘటనలో అమాయక గిరిజనులను పోలీసులు అక్రమంగా నిర్భంధించి వేధింపులకు గురిచేస్తున్నారని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స ఆరోపించారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దారకొండ ప్రాంతంలోని అనేక మంది గిరిజనులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ పేరిట వారిని చిత్ర హింసలకు గురిచేస్తుండడం సరికాదని అన్నారు. గిరిజనులను నిర్భంధించిన పోలీసులు వారిని కోర్టుకు హాజరుపరచకుండా తమ ఆధీనంలో ఉంచుకోవడం పౌరుల ప్రాధమిక హక్కులకు భంగం కలిగించడమేనని ఆయన అన్నారు. గూడెంకొత్తవీధి మండలంలోని తమ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్న బాకూరు కోటేశ్వరరావును నాలుగు రోజులుగా పోలీసులు నిర్భంధించి వేధింపులకు గురిచేస్తుండడం సరికాదని ఆయన అన్నారు. బాక్సైట్ తవ్వకాలకు, పోలీసు ఔట్ పోస్టుల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆయన పనిచేసినందునే సెల్ టవర్ దగ్ధం సంఘటనలో అక్రమంగా అరెస్ట్ చేసారని ఆయన ఆరోపించారు. తమ సంఘం నాయకుడితో పాటు మిగిలిన గిరిజనులు పోలీసులు విడిచిపెట్టకపోతే ప్రజా ఉద్యమాన్ని చవిచూడాల్సి వస్తుందని అప్పలనర్స హెచ్చరించారు.

ఏజెన్సీలోని హరిజనులకు ఉచిత గ్యాస్ కనెక్షన్‌లు
అరకులోయ, అక్టోబర్ 21: గిరిజన, హరిజన కుటుంబాలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్‌లు ఇవ్వనున్నట్టు అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తెలుపు రేషన్ కార్డు కలిగిన హరిజన, గిరిజనులకు మాత్రమే ఉచితంగా గ్యాస్ కనెక్షన్‌లు పంపిణీ చేస్తామని చెప్పారు. ఏజెన్సీలోని ప్రస్తుతం గిరిజనులకు ఉచిత గ్యాస్ కనెక్షన్‌లను పంపిణీ చేస్తుండగా హరిజనులకు త్వరలోనే వీటిని అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సూచనలను పరిగణలోకి తీసుకుని ప్రతి కుటుంబానికి గ్యాస్ స్టవ్, రెగ్యులేటర్, పైపులు, ఐదు కిలోల గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయనున్నట్టు ఆయన వివరించారు. విద్యుత్ సదుపాయం లేని గిరిజన గ్రామాలన్నింటికి విద్యుత్ వెలుగులు నింపేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. అరకులోయ నియోజకవర్గంలోని 421 గ్రామాలకు గాను ప్రస్తుతం 380 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని ఆయన చెప్పారు. మారుమూల ప్రాంతాలలో ఉన్న మిగిలిన 41 గ్రామాలకు సోలార్ విధానంలో విద్యుత్ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. అరకులోయ పట్టణంలో అర్థాంతరంగా నిలిచిపోయిన కల్యాణ మండప నిర్మాణాన్ని పూర్తి చేయించేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిర్మించిన దుకాణ సముదాయాన్ని నిరుద్యోగులకు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని సర్వేశ్వరరావు పేర్కొన్నారు.
భూ రికార్డుల స్వచ్చీకరణ పనులు వేగవంతం చేయాలి
* ఆర్డీవో సూర్యారావు

మాకవరపాలెం, అక్టోబర్ 21: భూ రికార్డుల స్వచ్చీకరణ పనులు వేగవంతం చేయాలని ఆర్డీవో కె.సూర్యారావు సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని మాకవరపాలెం , కొండల అగ్రహారం, గిడుతూరు, తాడపాల గ్రామాల్లో రెవెన్యూ పరిధిలో ఉన్న భూములను రికార్డుల ఆధారంగా స్వచ్చీకరణ చేసేందుకు గుర్తించారు. ఈ సర్వే పనులను శనివారం మండలంలోని మాకవరపాలెంలో ఆర్డీవో సూర్యారావు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ రికార్డుల స్వచ్చీకరణతో రైతుల భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రతీ సర్వే నెంబర్‌లోని భూమిని సర్వే చేసి రికార్డుల ఆధారంగా వారి యొక్క భూ కొలతలు ,సరిహద్దులను సరి చేయాలని ఆయన సూచించారు. అలాగే రైతుల వద్ద ఉన్న రికార్డులు, రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న రికార్డులను సరి చూసి వాటి ఆధారంగా ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే వాటిని రైతులు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సర్వేలో పరిష్కారం కాని భూ సమస్యలుంటే వాటిని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వారి ఆదేశాల మేరకు పరిష్కరించడం జరుగుతుందన్నారు. మండలంలో అన్ని గ్రామాల్లో శతశాతం భూములను సర్వే చేసి రికార్డులు స్వచ్చీకరణ చేసి అనంతరం ఆన్‌లైన్, పట్టాదారు పాసుపుస్తకాలు ఇతర భూ సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ తారకేశ్వరి, డి.టి. ప్రసాదరావు, ఆర్. ఐ.లు శ్రీను, రమేష్ , పలువురు వి. ఆర్. ఓ.లు పాల్గొన్నారు.

సెల్ టవర్ దగ్ధం చేసిన ఘటనలో పాల్గొన్న గిరిజనులను అరెస్ట్ చేసిన పోలీసులు

సీలేరు, అక్టోబర్ 21: జి.కె.వీధి మండలం దారకొండ సెల్ టవర్ దగ్ధం చేసిన ఘటనలో మావోయిస్టులకు సహకరించిన గిరిజనులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈసందర్భంగా జి.కె.వీధి సి. ఐ. నారాయణరావు మాట్లాడుతూ ఈనెల 12వ తేదీన జరిగిన మావోయిస్టులు సెల్ సామగ్రి పేల్చివేత సంఘటనలో దారకొండకు చెందిన నడిగెట్ల నాగు(42), దలై రాజుబాబు(41), నిమ్మచెట్టుకు చెందిన బాకూరి కోటేశ్వరరావు(34), యర్రగెడ్డ గ్రామానికి చెందిన పాగిదాసు(27), వంతలసత్తిబాబు(25), వంతల సత్తిలు మావోయిస్టులకు అవసరమైన సామగ్రి ఏర్పాటుతో పాటు దారకొండలో వాల్ పోస్టర్లుఅతికించినట్లు సి. ఐ.నారాయణరావు తెలిపారు. వీరిపై ప్రాధమిక దర్యాప్తు పూర్తి స్థాయిలో జరిపి, మావోలకు వీరు సహకరించినట్లు నిర్దారణ కావడంతో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎస్సై విభూషణరావు పాల్గొన్నారు.

అక్రమ అరెస్ట్‌లకు నిరనగా పోలీస్ స్టేషన్ ఎదుట బైథాయించిన ఎమ్మెల్యే ఈశ్వరి

సీలేరు, అక్టోబర్ 21: అమాయక ఆదివాసీ గిరిజనులను అరెస్ట్ చేసిన పోలీసులు తక్షణం బేషరత్తుగా విడుదల చేయాలని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేసారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయిచారు. మావోయిస్టుల చర్యలకు అమాయక గిరిజనులను బలిచేయడం సమంజసం కాదని, ఇంటరాగేషన్ పేరుతో పోలీసులు ఆదివాసీలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో సి. ఐ. నారాయణరావుతో సమావేశమై అక్రమ అరెస్ట్‌లను ఖండిస్తూ మావోయిస్టులే సెల్‌టవర్‌ను దగ్ధం చేసారని చింతపల్లి డి ఎస్పీ స్వయంగా పత్రికల ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందేనన్నారు. దీనిలో గిరిజనులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. దీనిపై స్పందించిన సి. ఐ. తమ వద్ద ఉన్న సమాచారం మేరకే గిరిజనులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. మావోయిస్టులు సెల్ టవర్ దగ్ధం చేసే సమయంలో కొంత మంది సహకరించినట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు. మీ వద్ద ఆరాధాలు ఉంటే బయట పెట్టాలని ఎమ్మెల్యే సి. ఐ. కు తెలిపారు. ఎవరో ఇచ్చిన సమాచారంతో గిరిజనులను వేధించడం సరికాదన్నారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి ముగ్గురు గిరిజనులను విడుదల చేసారు. మిగతా వారిని కూడా విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పౌర హక్కుల సంఘాల నాయకులకు, జిల్లా ఎస్పీకి దృష్టికి తీసుకువెళ్ళి వారికి న్యాయం చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో చింతపల్లి జెడ్పిటిసి పద్మకుమారి, ఎం.పి.పి. బాలరాజు, దారకొండ సర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు.