విశాఖ

దూకుడు పెంచిన మావోలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, అక్టోబర్ 22: ఎ. ఓ.బి.లో మావోయిస్టులు దూకుడు పెంచారు. ఇన్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడుతున్నారు. పోలీసుల దూకుడును తగ్గించేందుకు ఇన్‌ఫార్మర్లను హతమార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖ మన్యంలో జరుగుతున్న వరుస హత్యలతో పోలీస్ ఇన్‌ఫార్మర్లు భయాందోళనకు గురవుతున్నారు. ఏడాది క్రితం ఎ. ఓ.బి.లో పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో 21 మందిని హతమార్చి మావోయిస్టులను కోలుకోలేని దెబ్బతీసారు. ఈసంఘటనలో మావోయిస్టు ఆగ్రనేతలు సైతం హతమయ్యారు. ఈభారీ సంఘటనతో పాటు తదనంతరం మావోయిస్టులపై జరిగిన దాడులకు పోలీస్ ఇన్‌ఫార్మర్లే కారణంగా మావోయిస్టులు భావిస్తున్నారు. పోలీస్ ఇన్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని పోలీసుల దూకుడుకు ఎఓబిలో అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 16వ తేదీ తెల్లవారు జామున దారకొండ వద్ద అన్నవరంకు చెందిన ఏజన్సీ వ్యాపారి గొంప లోవ శ్రీనివాస్‌ను పోలీసు ఇన్‌ఫార్మర్ అనే నెపంతో మావోయిస్టులు హతమార్చారు. ఈసంఘటన జరిగిన వారం రోజులు కూడా గడువక ముందే ఆదివారం పట్టపగలు ఎ. ఓ.బి.లోని చిత్రకొండ లాంచ్‌ఘాట్ వద్ద లాంచ్ డ్రైవర్ సోమ పాంగిని మావోయిస్టులు కాల్చి చంపారు. ఈరెండు హత్యల ద్వారా తమకు చెందిన సమాచారాన్ని పోలీసులకు చేరవేయడం ద్వారా ఉద్యమానికి తీవ్ర నష్టం కలిగిస్తున్న ఇన్‌ఫార్మర్లను మావోయిస్టులు టార్గెట్‌గా చేసుకున్నట్లు అర్ధమవుతోంది. ఈనెల 13వ తేదీన దారకొండ వద్ద సాయుధ మావోయిస్టులు బిఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్‌ను పేల్చివేసారు. ఈసంఘటనలో మావోయిస్టులతో పాటు సానుభూతి పరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సెల్‌టవర్ పేల్చివేత సంఘటన పోలీసులను సైతం విస్మయానికి గురి చేసింది. విశాఖ ఏజన్సీలో మావోయిస్టుల ప్రభావం నామమాత్రంగా మారిందని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటనలు చేస్తున్న నేపధ్యంలో సుమారు 200 మంది సానుభూతి పరులతో కలిసి మావోయిస్టులు సెల్‌టవర్‌ను పేల్చివేయడం పోలీసులకు సవాల్ విసిరినట్లైంది. ఒక వైపు విధ్వంసాలకు పాల్పడుతూనే మరో వైపు పోలీసు ఇన్‌ఫార్మర్లను హతమార్చుతున్న మావోయిస్టుల చర్యలపై పోలీస్ ఇన్‌ఫార్మర్లలో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే కొంత మంది ఇన్‌ఫార్మర్లు ఏజన్సీని వదిలి మైదానప్రాంతాలకు తరలిపోతుండగా మరికొంత మందిని పోలీసులు అప్రమత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏజన్సీ వ్యాపారిని హతమార్చిన మావోయిస్టులు సంఘటనా స్థలంలో వదిలిన లేఖలో పోలీస్ ఇన్‌ఫార్మర్లు తమ పద్దతులను మార్చుకోక పోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పవని హెచ్చరించారు. మొదటి జరిగిన సంఘటనతో పెద్దగా స్పందించని పోలీసు అధికారులు సైతం తాజాగా ఆదివారం జరిగిన మరో ఇన్‌ఫార్మర్ హత్య నేపధ్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. మొత్తం మీద ఎ. ఓ.బి.లో మావోయిస్టులు తమ దూకుడును పెంచారని చెప్పక తప్పదు.