విశాఖపట్నం

మురుగు కాలువలోకి ఔషధ వ్యర్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక, అక్టోబర్ 22: పరవాడ వద్ద గల జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో గల ఒక ఔషధ కంపెనీ వ్యర్థ జలాలను నిబంధనలకు విరుద్ధంగా మురుగు కాలువలో విడిచి పెట్టినట్లు తాడి బీసీ కాలనీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలు సెలవు కావడం అధికారుల పర్యవేక్షణ ఉండదని తెలుసుకున్న తాడి బీసీకాలనీకి అనుకుని ఉన్న ఒక ఔషధ కంపెనీ మురుగు కాలువలో వ్యర్థ జలాలను విడిచిపెట్టినట్లు తాడి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఔషధ కంపెనీలకు చెందిన వ్యర్థ జలాలను ఎట్టి పరిస్థితిల్లో మురుగు కాలువలో విడిచి పెట్టరాదు. మురుగు కాలువల్లో వ్యర్థ జలాలను విడిచి పెట్టడం కారణంగా భూగర్భ జలాలు కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. ఇలా చేస్తే ఔషధ కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రభుత్వం అపరాధ రుసుం విధిస్తుంది. అయితే అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఫార్మాసిటీలో నిత్యం ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాడి బీసీ కాలనీకి ఆనుకుని ఒక ఔషధ కంపెనీ నుండి ఆదివారం వ్యర్థ జలాలు మురుగు కాలువలోకి వచ్చి చేరినట్లు స్థానికులు గుర్తించారు. దీనిపై వెంటనే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చర్యలు తీసుకోవాలని తాడి మాజీ సర్పంచ్ బొడ్డపల్లి అప్పారావు డిమాండ్ చేశారు.

వారాంతపు కార్యక్రమాలతో సందర్శకులకు
కనువిందు :జెడ్సీ సత్యవేణి
మధురవాడ, అక్టోబర్ 22 : స్థానిక శిల్పారామం జాతరలో వారాంతపు కార్యక్రమాలతో సందర్శకులకు కనువిందు కలుగుతుందని జివిఎంసి జోన్1 కమిషనర్ పి.ఎం.సత్యవేణి అన్నారు. శిల్పారామంలో ఆదివారం సాయంత్రం జివిఎంసి, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శాస్ర్తియ, జానపద నృత్యాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని జెడ్సీ సత్యవేణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సిరి డాన్స్ అకాడమీ, టిఎస్ కళాసమితి కాళాకారులు ప్రదర్శించిన నృత్యాలు వేణుగాన సమ్మోహనం, కృష్ణ మాయింటికి రావా, ధాండియా, కృష్ణ గ్రూప్‌డాన్స్, తరంగ నృత్యం వంటివాటికి కళాకారులు సిరి, కావ్య, రేష్మశ్రీ, గీతిక, జాశ్మీత, శ్రీయ, కీర్తన, తపస్వి, ప్రదేవి, వౌనిక, శ్రీదేవి, శరణ్య తదితరులు నృత్యాలతో ప్రేక్షకుల మన్ననలను పొందారు. స్థానిక శిల్పారామం జాతర పరిపాలనాధికారి శివప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జివిఎంసి స్పోర్ట్స్ డైరెక్టర్ సిహెచ్ సత్యన్నారాయణ రావు, యుసిడి గౌరీశంకరరావు తదితరులు పాల్గొన్నారు.