విశాఖపట్నం

రవిబాబు ఆటకట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 22: రవిబాబు, భూపతిరాజుకు ఉచ్చు బిగుసుకుంటోంది. గేదెల రాజు హత్య కేసులో ఏ1గా ఉన్న డిఎస్పీ రవిబాబు, పద్మలతను విషమిచ్చి చంపిన కేసులో అతడినే ఏ1 కాబోతున్నాడు. పద్మలతకు విషమిచ్చి చంపిన గేదెల రాజు ఇప్పటికే మరణించాడు. దీంతో ఈ కేసులో రవిబాబు ఏ1 కాబోతున్నాడు. పద్మలతను హతమార్చడానికి గేదెల రాజుతో కోటి రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్ 50 లక్షలను భూపతిరాజు శ్రీనివాసరాజుతోనే అతనికి రవిబాబు ఇప్పించాడు. దీంతో భూపతిరాజు ఈ కేసులో ఏ2 కాబోతున్నాడు. గేదెలరాజు, పద్మలత హత్య కేసుల నుంచి రవిబాబు, భూపతిరాజు ఇక తప్పించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ రెండు హత్య కేసులకు సంబంధించి పోలీసులు ఇప్పటికే పక్కా సాక్ష్యాలు సంపాదించారు. రవిబాబు చోడవరంలలో లొంగిపోయినప్పుడు తనకు ఈ హత్యలకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పాడు. అయితే, న్యూ పోర్టు పోలీస్ స్టేషన్‌లో విచారణకు తీసుకువచ్చినప్పుడు పోలీసుల వద్ద ఉన్న ఆధారాలను చూపించారు. దీంతో రవిబాబు నేరం అంగీకరించక తప్పలేదు. కాగా, పద్మలత హత్యకు రవిబాబు సూత్రధారి అనడానికి గేదెల రాజు, రవిబాబు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ రికార్డు ఒక్కటే. గేదెల రాజును హతమార్చితే, ఆ సాక్ష్యం కూడా మాయమవుతుందని రవిబాబు భావించాడు. ఆయన ఊహించని విధంగా ఆ ఫోన్ రికార్డు బయటపడింది. దీంతో పోలీసులు తీగలాగారు. రవిబాబు అఘాయిత్యాలన్నీ ఒక్కటొక్కటిగా బయటపడ్డాయి. ఇన్ని జరుగతున్నా, పద్మలత హత్యకు సంబంధించి తనపై ఎవ్వరూ ఫిర్యాదు ఇవ్వలేనందువలన కేసు నిలబడదని రవిబాబు భావించి ఉండచ్చు. కానీ పోలీసులు కాకర నూకరాజు నుంచి గత శనివారం స్టేట్‌మెంట్ తీసుకున్నారు. పద్మలత హత్యకు ముందు జరిగిన వ్యవహారమంతా పోలీసులు భూపతిరాజు శ్రీనివాసరాజు నుంచే రాబట్టి ఉంటారని తెలుస్తోంది. ఎందుకంటే ఈ కేసులో 12 మంది నిందితులు. పోలీసులు అరెస్ట్ చేసింది తొమ్మిది మందిని మాత్రమే. వారికి గేదెల రాజు హత్యకు సంబంధించి మిగిలిన విషయాలేవీ తెలిసే అవకాశాలు లేవు. గేదెల రాజును హతమార్చమన్నది ఓ పెద్దాయన అని మాత్రమే భూపతిరాజు వీరికి చెప్పాడు. పద్మలత హత్య గురించి పూర్తి వివరాలు గేదెలరాజు, భూపతిరాజుకు మాత్రమే తెలుసు. గేదెల రాజు మృతితో తను అన్ని వ్యవహారాల నుంచి బయటపడ్డానని రవిబాబు భావించి ఉండచ్చు. కానీ ఈ కేసులన్నీ చివరకు తన తలకే చుట్టుకుంటాయని ఆయన అనుకోలేదు.
రవిబాబు అక్రమార్జనపై బయటపడుతుందా?
రవిబాబు చాలా కాలంగా పోలీస్ వృత్తిలో ఉన్నాడు. ఆయన పనిచేసిన చోటల్లా అధికార, ప్రతిపక్ష నాయకులకు తలలో నాలుకలా వ్యవహరించేవాడు. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో తన సామాజిక వర్గాన్ని కూడా తనకు రక్షణ కవచంగా మార్చుకున్నాడు. రవిబాబు పనిచేసిన చోటల్లా మంచిపేరు తెచ్చుకున్నాడు. పద్మలత, గేదెల రాజును హతమార్చింది రవిబాబు అని తెలిసిన తరువాత చాలా మంది ముక్కున వేలేసుకున్నారు. ఒక పోలీస్ అధికారిగా బయట చాలా మంచివాడిగా నటిస్తూ, తెరవెనుక చాలా కథలు నడిపించేవాడు. ఆయన చేయని దందాలేదు, చేయని సెటిల్‌మెంట్ లేదు. దీంతోనే రవిబాబు కోట్ల రూపాయలు ఆర్జించినట్టు తెలుస్తోంది. రవిబాబు అక్రమార్జన గురించి జిల్లా పోలీస్ అధికారులకు తెలిసినా, ఆయనకున్న రాజకీయ పలుకుబడి వలన ఎవ్వరూ నోరు మెదపలేదు. అయితే, రవిబాబు అజ్ఞాంతోలోకి వెళ్లిన తరువాత ఆయన అక్రమార్జన బయట పడకుండా జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. న్యూ పోర్టు పోలీస్ స్టేషన్ నుంచి రవిబాబు నేరుగా ఆయన ఇంటికి తీసుకువెళ్లి సోదాలు నిర్వహించినా, అక్రమ ఆస్తులేవీ బయటపడకపోవడమే ఇందుకు నిదర్శనం.
రవిబాబుకు, అధికారులకు మధ్య కోల్డ్‌వార్
రాజకీయ అండతో రవిబాబు చెలరేగిపోవడం కొంతమంది పోలీస్ అధికారులకు కూడా ఇష్టపడలేదు. దీంతో కొంతమంది పోలీస్ అధికారులు రవిబాబు అంటే గుర్రుగా ఉన్నారు. జంట హత్యల కేసులలో రవిబాబు ఏ1 కావడంతో కొంతమంది పోలీసులే రవిబాబు గురించి సమాచారాన్ని లీక్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రవిబాబు నగర పోలీసులకు లొంగిపోకుండా, రూరల్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోవడానికి కూడా ఇక్కడి అధికారులకు, ఆయనకు మధ్య సాగుతున్న కోల్డ్‌వార్ అని తెలుస్తోంది. గేదెలరాజు హత్య జరిగిన మరుసటి రోజు నుంచి మీడియాలో వరుస కథనాలు వస్తున్నా, పోలీసులు స్పందించలేదు. ఈ కథనాలను వారు పరిగణలోకి తీసుకుని ఈ హత్యలకు సంబంధించి సాక్ష్యాధారాలను సేకరించినట్టు తెలుస్తోంది.

రేషన్‌కార్డుల సవరణ మేళా
గోపాలపట్నం, అక్టోబర్ 22 : జివి ఎంసి 66, 67, 68 డివిజన్ల పరిధిలోని రేషన్ కార్డుల్లో సవరణలు ఉంటే చెయ్యడానికి ఈనెల 26న మేళా నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. పేర్లలోను, చిరానామాల్లోను సవరణలు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. జివి ఎంసి 68వ డివిజన్ ప్రశాంత్‌నగర్‌లో ఉన్న శ్రీపైడితల్లమ్మ వారి ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరగనుందని తెలిపారు.