విశాఖపట్నం

అడవిలో టెన్షన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 22: ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మళ్లీ అలజడి మొదలైంది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్న రామగుడ ప్రాంతంలో గత ఏడాది అక్టోబర్ 24న భారీ ఎన్‌కౌంటర్ జరిగి సుమారు 32 మంది మావోయిస్ట్‌లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆరోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్‌లు భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వచ్చింది. మావోయిస్ట్ అగ్రనేత ఆర్.కె సహా మరికొంతమంది కీలక నేతలు రామగుడ ప్రాంతంలో సమావేశం నిర్వహిస్తున్నారని తెలిసి, పోలీసులు ఎటాక్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆర్.కె తప్పించుకున్నా, ఆయన కుమారుడు ఫృద్వీ మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో గాలికొండ దళ నాయకుడు గణేష్‌తోపాటు మరికొంతరు కీలక సభ్యులు మరణించారు. ఈ ఎన్‌కౌంటర్ మావోయిస్ట్‌లకు కోలుకోలేని దెబ్బ తగిలింది. దాదాపూ దళం తుడిచిపెట్టుకు పోయిందని పోలీసులు భావించారు. ఎన్‌కౌంటర్ తరువాత ఏఓబిపై పోలీసులదే పైచేయి అయింది. ఈనేపథ్యలో గిరిజనులను పోలీసులు మచ్చిక చేసుకుంటూ వచ్చారు. అయితే, కొద్ది రోజుల కిందట మావోయిస్ట్‌లు మళ్లీ ఉనికి చాటుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈనెల 12న దారకొండలో బిఎస్‌ఎన్‌ఎల్ టవర్‌ను పేల్చేశారు. ఈ ఘటనలో మావోయిస్ట్‌లతోపాటు, గుత్తికోయలు కూడా పాల్గొనడం పోలీసులను కలవరపెడుతోంది. ఈ ఘటన తరువాత కోరుకొండలో పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఒక వ్యాపారిని హతమార్చారు. చిత్రకొండలో ఆదివారం మరొక ఇన్ఫార్మర్‌ను మావోయిస్ట్‌లు చంపేశారు. అంతకు ముందు బిఎస్‌ఎఫ్ బలగాలకు ఆహారాన్ని తీసుకువెళతున్న వ్యాన్‌ను మావోయిస్ట్‌లు దారిమళ్లించారు. ఏఓబిలో భారీ పోలీసులు బలగాలు నిరంతరం కూంబింగ్ చేస్తున్నా, మావోయిస్ట్‌లు ఇటువంటి చర్యలకు పాల్పడడం ఆశ్ఛర్యంగా ఉంది.
మరోపక్క గత ఏడాది అక్టోబర్ 24న భారీ ఎన్‌కౌంటర్‌లో 32 మందిని పోగొట్టుకున్న మావోయిస్ట్‌లు అందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సెల్ టవర్ ద్వారా మావోయిస్ట్‌ల జాడను పోలీసులు కనిపెడుతున్నారన్న అనుమానంతో బిఎస్‌ఎన్‌ఎల్ టవర్‌ను పేల్చేశారు. మావోయిస్ట్‌లు భారీ విధ్వంసానికి పాల్పడడం కోసమే ఈ టవర్‌ను పేల్చి ఉంటారని గిరిజనులు భావిస్తున్నారు. గాలికొండ దళం పూర్తిగా నిర్వీర్యమైపోవడంతో అందులో మిగిలిన వారు కోరుకొండ దళ సహకారం కూడా తీసుకుంటున్నట్టు ఇటీవలే బయటపడింది.
ఇదిలా ఉండగా ఎన్‌కౌంటర్ జరిగి సంవత్సరం అయిన నేపథ్యంలో మావోయిస్ట్‌లు ఎటువంటి చర్యలకైనా తెగబడతారన్న ఉద్దేశంతో ఏఓబిలో కేంద్ర బలగాలను మోహరించారు. మావోయిస్ట్‌ల కోసం అడవి మొత్తాన్ని వీరు జల్లెడపడుతున్నారు. పోలీసులకు ఉన్న ఇంటిలిజెన్స్‌ను కూడా ఉపయోగించి, మావోయిస్ట్‌ల కదలికలను కనుగొంటున్నారు. అలాగే ఏఓబిలోని పెదవలస, సీలేరు, పాడేరు, పెదబయలు, ముంచింగిపుట్, చింతపల్లి, జి.కె.వీధి, అన్నవరం తదితర పోలీస్ స్టేషన్లకు భద్రతగా కేంద్ర బలగాలను ఉంచారు. అలాగే, కటాఫ్ ఏరియాలో ఉన్న కేంద్ర బలగాలకు రోడ్డు మార్గం గుండా ఆహార పదార్థాలను తీసుకువెళ్లే పరిస్థితి లేకపోవడంతో హెలికాప్టర్లలో నిత్యావసర వస్తువులను అక్కడికి తరలిస్తున్నారు. అలాగే, ఆంధ్ర, ఒడిశా పోలీసులు జాయింట్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నారు. ఏఓబిలోని పరిస్థితిని పోలీస్ ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు.