విశాఖ

సబ్ కలెక్టర్ సుడిగాలి పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంచంగిపుట్టు, అక్టోబర్ 23: మండలంలో సోమవారం పాడేరు సబ్ కలెక్టర్ డి.కె.బాలాజీ సుడిగాలి పర్యటన చేశారు. స్థానిక తహశీల్థార్ కార్యాలయాన్ని సందర్శించి రెవిన్యూ రికార్డులను పరిశీలించారు. మండల కేంద్రంలోని దుర్గగుడ కాలనీలో ఎన్నో ఏళ్ళుగా ఉన్న భూ సమస్యను తెలుసుకునేందుకు నేరుగా వెళ్ళి స్వయంగా తెలుసుకున్నారు. భూతగాదా పడుతున్న ఇరు వర్గాలను పిలిపించి రెవిన్యూ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. రెవిన్యూ రికార్డుల్లో ఉన్న విధంగా భూమి గల వారికి ఆ భూమి చెందుతుందన్నారు. అనంతరం స్థానిక సి.హెచ్.సి.ని సందర్శించి మందుల గది, ల్యాబ్, రికార్డులను తనిఖీ చేశారు. మందుల వివరాలను వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. వార్డులను పరిశీలించిన ఆయన రోగులకు అందుతున్న వైద్యంపై స్వయంగా రోగులను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా నిర్మించిన శిశు సంక్షేమ జనన కేంద్రం పూర్తయితే అది ఎందుకు ప్రారంభించలేదని వైద్యాధికారిని అడగా అది త్వరలోనే ప్రారంభిస్తామని వైద్యాధికారి బదులిచ్చారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలని, సిబ్బంది అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్ధార్ కొండలరావు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

శూలాల మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు
మునగపాక, అక్టోబర్ 23: కార్తీకమాసం రెండవ సోమవారం మునగపాక శూలాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా గత 15రోజులుగా స్వామివారి ఊరేగింపునకు అవసరమైన ముత్యాల పల్లకీని సర్వాంగ సుందరంగా తయారుచేస్తున్నారు. గత నెలరోజులుగా శివభక్తులు ఇంటింటికి వెళ్లి భజనలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోనే అత్యంత వైభవంగా నిర్వహించే ఉత్సవాల్లో శ్రీ సాంబశివుని శూలాల మహోత్సవం పోస్టర్‌ను యలమంచిలి శాసనసభ్యులు పంచకర్ల రమేష్‌బాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ బూడి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు దాడి ముసిలి అప్పారావు, ఎంపీటిసి టెక్కలి పరశురామ్ తదితరులు పాల్గొన్నారు.