విశాఖ

ప్రత్యేక హోదా ఎపి హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 16: ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కని సినీ నటుడు, ప్రత్యేక హోదా సాధన సమితి ప్రతినిధి శివాజీ అన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఎయులో గురువారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం వైఖరిని ఆయన తప్పుపట్టారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి, ఇప్పుడు కుదరదంటున్న బీజేపీ వైఖరిపై ధ్వజమెత్తారు. బిజెపితో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో టీడీపీ కూడా ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని డిమాండ్ చేసిందని, ఇప్పుడు కేంద్రంతో లాలూచీ పడి హోదా అంశాన్ని పక్కనపెట్టారని విమర్శించారు. హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయం కాదని గుర్తు చేశారు. హోదా కోసం తాము రాజీలేని పోరాటం చేస్తామని ఉద్ఘాటించారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఐ జిల్లా అధ్యక్షుడు ఎజె స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.