విశాఖ

పర్యాటక ప్రోజెక్టులతో ఉపాధి మెరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరుకులోయ, నవంబర్ 17: పర్యాటక ప్రోజెక్టులతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియి పేర్కోన్నారు. స్థానిక పర్యాకాభివృద్థిసంస్థ అతిధి గృహంలో పర్యాట అధికారులతో ఆమే శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ టూరిజంకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చే విదంగా ప్రాజెక్టుల రూప కల్పన చేస్తున్నామని , తద్వారా స్థానికులకు ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. ఈ ప్రాంతంలో లభ్యమయ్యే వనరులను ఉపయోగించుకొని ఉపాధి అవకాశాలపై మృహత్తర ప్రణాళికను రూపోందిచాల్సి ఉందన్నారు. ఈ సరికొత్త ప్రణాళిక రూపోందించిన అనంతరం ముఖ్య మంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి ప్రణాళిక అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిరుద్యోగ యువతను గుర్తించి ప్రత్యేక శిక్షణా తరగతి నిర్వహించి వారికి ఉపాధి కల్పించేలా చర్యలుతీసుకోనున్నట్టు ఆమే చెప్పారు. పర్యాటకంగా అరుకులోయకు గుర్తింపు తీసుకు వచ్చేందుకు ముఖ్య మంత్రి ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారన్నారు. ఈ నేపధ్యంలో అరుకులోయతో పాటు మణ్యం వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలన్నింటిని గుర్తించి పర్యాటకులు సౌకర్యార్థం సకల సధుపాయాలు కల్పిస్తామన్నారు. అరకులోయలో హెల్త్‌టూరిజంను అభివృద్ది చేయనున్నట్లు ఆమే చెప్పారు. ఈ మేరకు పర్యాటక రంగ అభివృద్దికి అధికారులు, సిబ్బంది, నిరంతరం శ్రమించాలని ఆమే సూచించారు. పర్యాటక ఉద్యోగులు విధినిర్వాహణలో నిర్లక్ష్యం వహించినా, పర్యాటకులు పట్ల దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించినా సహించేది లేదని మంత్రి అఖిల ప్రియ హెచ్చరించారు. అనంతరం స్థానిక కాఫీహౌస్‌ను సందర్శించి అరుకు కాఫీని త్రాగి సంతృప్తిని వ్యక్తం చేసారు. ఈ సమావేశంలో పాడేరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రవిసుబాష్, పాడేరు సబ్‌కలెక్టర్ పికె బాలాజి, పర్యాటక ఈడి శ్రీరాములు నాయుడు ,పలువురు అధికారులు పాల్గొన్నారు.

చిత్రలేఖనం పోటీలు
అరకులోయ, నవంబర్ 17: జాతీయ గ్రంధాలయ స్వర్ణోత్సవాల్లో భాగంగా శుక్రవారం చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. స్థానిక శాఖా గ్రంధాలయ భవణంలో జరిగిన పోటీల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల , ఏపిటిడబ్ల్యు జూనియర్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. చిత్రలేఖనం పోటీల్లో 33 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ పోటీల్లో గెలుపోందిన విద్యార్థులకు వారోత్సవాల ముగింపు రోజు బహుమతులు ప్రధానం చేస్తామని గ్రంధాలయ అధికారి మురళీకృష్ణ తెలిపారు.

ఉత్తమ పంచాయితీలకు ప్రోత్సాహకాలు
అరకులోయ, నవంబర్ 17: మండలంలోని చినలబుడు, మాదల పంచాయితీలు ఉత్తమ పంచాయితీలుగా ఎంపికైనట్టు స్థానిక మండల పరిషత్ అభివృధ్థి అధికారి ఎం మళ్లికార్జునరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 2015-16 సంవత్సరంలో ఈ పంచాయితీలను ఉత్తమ పంచాయితీలుగా ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. చినలబుడు ఉత్తమపంచాయితీకి లక్ష రూపాయిలు, మాదల ఉత్తమ పంచాయితీకి రూ,7500 వంతున ప్రోత్సహం కింద ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్టు ఆయన చెప్పారు. ఈ పంచాయితీలను ఆదర్శంగా తీసుకొని మిగిలన పంచాయితీలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి ఉత్తమ పంచాయితీలుగా ఎంపికయ్యేలా కృషి చేయాలని మల్లికార్జునరావు సూచించారు.