విశాఖ

అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా విశాఖ,అరకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, నవంబర్ 17: జాతీయ, అంతర్జాతీయ స్థయిలో విశాకపట్నం , అరకలోయలను కీలకపర్యాటక కేంద్రాలుగా తీర్చి దిద్దాలన్నతే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మానవ వనరులు శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. స్థానిక ఎన్‌టిఅర్ క్రీడామైదానంలో పర్యాటకశాఖ ఆద్వర్యంలో చివరిసారిగా శుక్రవారం ఉదయం బెలూన్‌లను ఎగురవేసి వాటిలో ఆయన కొద్దిసేపు గగణం విహారం చేసి మురిసిపోయారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతిష్టాత్మక కార్యక్రమాల నిర్వాహణ ద్వారా విశాఖపట్నం, అరకులోయలను పర్యాటకంగా గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించే క్రమంలో అనేక వినోద బరితమైన కార్యక్రమాలు నిర్వహించి దేశవిదేశీ పర్యాటకులు, వ్యాపార వేత్తలు, ప్రముఖుల ఆధరాభిమానాలు చూరగొనుచున్నామన్నారు. ఇప్పటికే విశాఖ పట్నం, అరకులోయలలోనిర్వహించిన దసరావళి, ఆనందదీపావళి, సౌండ్స్ ఆన్ శాండ్ , హట్ ఎయిల్ బెలూన్ ఫెస్టివల్ కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చిందని ఆయన వెల్లడించారు. విశాఖపట్నంలో వచ్చేనెల 9,10 తేదీల్లో ప్రింజ్ పెస్టివల్, డిసెంబర్ 22, డిసెంబర్ 23,24 తేధీల్లో ప్రతిష్టాత్మక విశాఖ ఉత్సవ్ ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అదేవిదంగా సంక్రాంతికి కుకింగ్ వొలింపియాడ్, ఫిబ్రవరి 10 నుండి 14వ తేదీవరకు యాఛ్ పెస్టివల్ పేరుతో భారీ కార్యక్రమాలకు సన్నహాలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. అరకులోయ పర్యాటక కేంద్రంలో మళ్లీ అందర్జాతీయ స్థాయి హాట్‌ఎయిర్ బెల్‌న్ ఫెస్టివల్ నిర్వహించేందకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దక్షిణ భారత దేశంలో తొలి బెలూన్‌ల ఫెస్టివల్‌కు ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకులోయ వేదిక అయ్యిందని ఆయన చెప్పారు. భవిష్యత్‌లో లక్నో, ఆగ్రా, రాజస్థాన్ లలో నిర్వహించిన బెలూన్ ఫెస్టివల్‌కు దీటుగా అరకులోయలో నిర్వహిస్తామన్నారు. ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన బెలూన్ ఫెస్టివల్‌ను మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడంతో పర్యాటక శాఖలో సరికొత్త ఉత్సాహం నింపిందన్నారు. అందులోను ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా పేరోందిన విశాఖ జిల్లాలో ఈ ఉత్సవాన్ని నిర్వహించడం పర్యాటక ప్రాంతాలకు మరింత విసృత ప్రచారం లభించినట్టైందని ఆయన చెప్పారు. మంచు తెరలను చీల్చుకుంటూ వేడి గాలులతో నీళిమేఘాల్లోకి ఎగురుతూ రంగుల బెలూన్‌లు పర్యాటకులను ఎంతో ఆకట్టుకున్నాయన్నారు. చుట్టు కొండలు, పచ్చని పోలాలు , నేలతల్లికి పసుపు పారాణిని తలపించే వలిసెపూల సోయగాల మీదుగా గాలిలలో తేలుతూ బెలూన్‌లలో ప్రయాణం పర్యాటకులకు మధురమైన అనుభూతిని మిగిల్చిందని ఆయన తెలిపారు. ప్రతీరోజు విశాఖ పట్నం , అరకులోయలలో ఏదో ఒక ఆహ్లాద కరాన్నిచ్చే కార్యక్రమాలు నిర్వహించి పర్యాటకులును ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. అంతకు ముందు మంత్రికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సాదరంగా స్వాగతం పలికి దుస్సాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రవిసుభాష్ , పాడేరు సబ్‌కలెక్టర్ పికె బాలాజి , తెలుగుదేశం పార్టీ నాయకులు లాలం భాస్కర్, శివేరిసోమ, శెట్టి బాబూరావు, సివేరి అభ్రహం, పిబి లక్ష్మి , కార్యకర్తలు పాల్గొన్నారు.