విశాఖపట్నం

అధికారులతో సిఎం విస్తృత సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 17: కొద్ది గంటలు మినహా మూడు రోజుల పాటు నగరంలోనే ఉండిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయి ఐఏఎస్ అధికారులతో శనివారం రాత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఎపి అగ్రిటెక్ సమ్మిట్ 2017 ప్రారంభ కార్యక్రమానికి బుధవారం ఉదయం హాజరైన చంద్రబాబు ఆరోజు రాత్రి నగరంలోనే ఉండిపోయారు. సమ్మిట్ రెండో రోజు కార్యక్రమంలో పూర్తిగా పాల్గొన్న చంద్రబాబు గురువారం రాత్రి విజయవాడ బయలుదేరి వెళ్లారు. శుక్రవారం ఉదయం సింగపూర్ ప్రతినిధులతో విజయవాడలో సమావేశమైన అనంతరం మధ్యాహ్నం తిరిగి విశాఖ చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌కు స్వాగతం పలికిన అనంతరం సిమ్మిట్‌కు చేరుకున్నారు. సాయంత్రం సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో బిల్‌గేట్స్‌తో పాటు పాల్గొన్న చంద్రబాబు, గేట్స్‌కు వీడ్కోలు పలికి తిరిగి నగరానికి చేరుకున్నారు. నోవాటెల్ హోటల్‌లో టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ సదస్సు ప్రారంభించిన ఆయన అదే హోటల్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాత్రి 7.15 గంటలకు ప్రారంభమైన అధికారిక సమీక్ష సుమారు గంటన్నర పాటు జరిగింది. సాధారణంగా అధికారిక సమీక్షలకు మీడియాను అనుమతించరు. సమావేశ వివరాలను సమాచార శాఖ ద్వారా పత్రికలకు పంపతుంటారు. అయితే శుక్రవారం నాటి అధికారిక సమీక్షకు సమాచార శాఖ ప్రతినిధులను కూడా అనుమతించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు, ఐటి, పంచాయతీరాజ్ శాఖల మంత్రి నారా లోకేష్‌తో పాటు ఒకరిద్దరు మంత్రులకు మాత్రమే అవకాశం కల్పించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్, రియల్‌టైం గవర్నెన్స్ సిఇఓ బాబు, సీనియర్ ఐఎఎస్ అధికారి బాలకృష్ణతో పాటు పలు శాఖలకు చెందిన కార్యదర్శులు, కమిషనర్లు మాత్రమే పాల్గొన్నారు. మూడు రోజుల పాటు పాలనా కార్యక్రమాలకు దూరంగా ఉన్నందునే ముఖ్యమంత్రి అధికారిక సమీక్ష నిర్వహించారని మంత్రులు పేర్కొంటున్నారు. ప్రచారానికి ఎనలేని ప్రాధాన్యతనిచ్చే చంద్రబాబు అధికారిక సమీక్ష విషయంలో మాత్రం దాపరికం పాటించడం గమనార్హం.