విశాఖ

ఎంసెట్ విద్యార్థులకు ఉచిత బస్సు సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 26: ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు సేవలను అందజేస్తున్నట్టు జాయింట్ కలెక్టర్-2 డి.వెంకటరెడ్డి తెలిపారు. ఈ నెల 29వ తేదీన ఆంధ్రా ఎంసెట్, మే 2న తెలంగాణ ఎంసెట్ జరగనున్న నేపధ్యంలో అభ్యర్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడమైందన్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 68 పరీక్షా కేంద్రాల్లో 36,857 మంది అభ్యర్ధులు ఎంసెట్ పరీక్షలు రాస్తున్నారన్నారు. అభ్యర్ధులు పరీక్షా కేంద్రాలకు సులువుగా చేరుకునేందుకు పెద్దఎత్తున ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు వారి హాల్ టికెట్‌ను చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. పరీక్షల ముందురోజు,పరీక్షల రోజు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని, పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు.
ఎంసెట్ కేంద్రాల వద్ద జామర్లు
ఎంసెట్ కేంద్రాల వద్ద జామర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంసెట్ రీజనల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ టి.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ నెల 29న నిర్వహించే ఎంసెట్‌కు అభ్యర్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకూ, మెడికల్‌కు సంబంధించి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకూ జరుగుతుందని తెలిపారు. ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించరని, పరీక్ష ప్రారంభానికి గంట ముందుగా రావాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రాల్లోనికి వాచీలు, ఫోన్‌లు, కాలిక్యులేకర్లు అనుమతించరు. విద్యార్థుల సౌకర్యార్థం గడియారాలను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష ముగిశాక ప్రశ్నాపత్రాన్ని అభ్యర్థులు తీసుకువెళ్లవచ్చు. ఎండ దెబ్బకు గురి కాకుండా తల్లితండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఒఎంఆర్ షీట్‌ను కేవలం నీలం/నలుపు బాల్ పాయింట్ పెన్నుతో మాత్రమే పూరించాలి. ఒక సారి పూరించాక జవాబు మార్చే వీలు ఉండదు. పరీక్షా హాల్‌లోకి పెన్సిల్, రబ్బరు, ఇంకు పెన్నులు, వైటనర్‌లను అనుమతించరు. వీటిని ఉపయోగిస్తే అటువంటి జవాబు పత్రాలను మూల్యాంకనం చేయరు. అభ్యర్థులు వీటిని గమనించాలని కోరారు.