విశాఖపట్నం

ప్రజాసేవకు ‘సాధికార మిత్ర’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 17: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ బూత్ కమిటీల వరకూ వెళ్లిందని, ఇకపై ప్రతి 30-35 కుటుంబాలకు పార్టీ కార్యకర్తలతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. విశాఖ జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ సాధికార కమిటీ వారికి కేటాయించిన ఇళ్లలోని వారి బాగోగులను పట్టించుకోవాలని అన్నారు. దీనివలన పార్టీకి, సదరు కార్యకర్తలకు మంచి పేరు వస్తుందని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు సామాజిక సమస్యలపై స్పందించాలని, వాటిని వెంటనే అధికారులకు తెలియచేయాలని చంద్రబాబు సూచించారు. వాటిని నిర్ణీత సమయంలో పరిష్కరించకపోతే, అధికారులపై చర్యలు తీసుకోడానికి వెనకాడనని అన్నారు. సంబంధిత మంత్రులు ఆయా శాఖల అధికారుల పనితీరులో మార్పు తీసుకురాకుంటే, వారిని కూడా దూరం పెడతానని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం పార్టీకి ఒక టానిక్‌గా మారిందని అన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అన్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన తరువాత మన బలం మరింత పెరిగిందని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. పార్టీ నేతలు కూడా అందుకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. పార్టీ నాయకుల సమర్థనుబట్టి పదవులు ఇస్తామని ఆయన చెప్పారు. త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు రానున్నాయని చంద్రబాబు చెప్పారు. ప్రతిపక్ష నాయకులు చెప్పిన మాటలను జనం విశ్వసించడం లేదని అన్నారు.
ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు చంద్రబాబుతో ముఖాముఖి మాట్లాడారు. జివిఎంసి ఎన్నికలు నిర్వహించాలని కోరగా, కోర్టులో కేసులు ఉన్నాయని, వాటిని త్వరలోనే పరిష్కరించి, ఎన్నికలకు వెళదామని చంద్రబాబు సమాధానం చెప్పారు. పంచ గ్రామాల సమస్యను పరిష్కరించడానికి ఉన్న అవకాశాలను నాయకులు ముఖ్యమంత్రికి వివరించారు. కోర్టు కేసులు ఉన్నందువలన తానే చొరవ తీసుకుని సమస్యకు పరిష్కారం చూపుతానని చెప్పారు. నీరు చెట్టు బిల్లులు రాలేదని నాయకులు చెప్పగా, త్వరలోనే మంజూరు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు తదితరులు పాల్గొన్నారు.