విశాఖపట్నం

బ్యాంకర్లు సహకరించట్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 21: ఎస్సీ,ఎస్టీ,బీసీ కార్పొరేషన్లలో అర్హతలుండీ, ఎంపికైన లబ్ధిదారులకు రుణాలు మంజూరులో బ్యాంకర్ల నుంచి సహకారం అందట్లేదని జెడ్పీటీసీలు మండిపడ్డారు. జెడ్పీ సీఈఓ జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో మంగళవారం జరిగిన స్థారుూ సంఘ సమావేశంలో పలువురు సభ్యులు బ్యాంకర్ల తీరును తప్పుపట్టారు. ఎస్సీ,బీసీ కార్పొరేషన్లలో ఎంపికైన అర్హులకు రుణాలు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంపై సభ్యులు ప్రశ్నించారు. బ్యాంకర్లు, ఎంపిక కమిటీల మధ్య నెలకొన్న బేధాభిప్రాయాలే ఇందుకు కారణమంటూ అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మహాలక్ష్మి మాట్లాడుతూ ఈ సంవత్సరం 3,702 మందికి రుణాలు ఇచ్చేందుకు ఎంపిక చేయగా, ఇప్పటి వరకూ 1,618 మందికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకారం తెలిపాయన్నారు. వీరికి మాత్రమే ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఆర్థిక సాయం అందించనున్నట్టు వెల్లడించారు. అయితే బ్యాంకులను ఒప్పించి ఎంపికైన వారందరికీ రుణాలు ఇప్పించేందుకు సమావేశం నిర్వహించినప్పటికీ కొంతమంది రుణాల చెల్లింపులో ట్రాక్‌రికార్డు నచ్చకపోవడంతో బ్యాంకర్లు నిరాకరిస్తున్నారన్నారు. బీసీ కార్పొరేషన్ ఈడీ గీతాదేవి మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12వల మంది అర్హులను గుర్తించి ఎంపిక చేసినట్టు వెల్లడించారు. వీరిలో 6,525 మందికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు అంగీకరించారని, ఇప్పటికే 4345 మందికి రుణాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. మిగిలిన వారికి కూడా త్వరలోనే రుణాలు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వికలాంగుల శాఖ ఎడి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ వికలాంగులను వివాహం చేసుకున్న సకలాంగులకు ఇచ్చే ప్రోత్సాహకాలపై మార్గదర్శకాలు వివరించారు. వివాహం రిజిస్ట్రేషన్ చేయించాలని, ఏడాది లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డీఆర్‌డీఏ ఏపీడీ రామ్మోహన రావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 46,800 మహిళా సంఘాలకు రూ.670 కోట్లు రుణాలు ఇవ్వాలని నిర్ణయించగా, ఇప్పటి వరకూ రూ.480 కోట్లు ఇచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ఆర్థిక సాయంపై అధికారులను వివరణ కోరారు. అర్హులైనప్పటికీ ముందుగా డబ్బుపెట్టి మరుగుదొడ్లు నిర్మించుకోలేకపోతున్నారన్నారు. వారికి ముందుగానే నగదు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. చంద్రన్న బీమా పథకం కింద జిల్లా వ్యాప్తంగా చనిపోయిన 5,881 మందికి రూ.37.12 లక్షల బీమా సొమ్మును అందజేసినట్టు తెలిపారు. తాత్కాలిక అధ్యక్షునిగా సబ్బవరం జెడ్పీటీసీ గేదెల సన్యాసిరావు వ్యవహరించగా, సభ్యులు కూన వనజ, ఎం కాసులమ్మ, వెంకటరమణ, కే సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.