విశాఖపట్నం

మెరుగైన అవగాహనకు భాష ఉపకరిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 21: మెరుగైన అవగాహనకు భాష ఉపకరిస్తుందని ఆంధ్రా యూనివర్శిటీ వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జీ నాగేశ్వర రావు అన్నారు. ఎయు మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహిస్తున్న భాష, సాహిత్యం రిఫ్రెషర్ కోర్సును మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మెథడాలజీ ఎంతో ప్రధానమైందన్నారు. బోధన నైపుణ్యం మెరుగు పరచుకుంటూ విద్యార్థులు సమర్ధవంతంగా అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులను ఆకట్టుకునే విధంగా తమ బోధనతో అధ్యాపకులు ఆసక్తి కలిగించడం ఎంతో అవసరమన్నారు. బోధన విధానాలను తెలుసుకునేందుకు ఇటువంటి శిక్షణ తరగతులు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. క్రమశిక్షణకు ప్రాధాన్యత అందిస్తూ ముందుకు సాగాలని సూచించారు. కేంద్ర సంచాలకులు ప్రొఫెసర్ పీ విశ్వనాథం మాట్లాడుతూ నిరంతరం అధ్యాపకులకు ఉపయుక్తమైన శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతోందన్నారు. నిపుణులతో ప్రత్యక్ష శిక్షణ అందించి అధ్యాపకుల సామర్ధ్యాలను పెంపుదల చేస్తున్నట్టు తెలిపారు. దేశంలోనే ప్రధమ స్థానంలో ఎయూ హెచ్‌ఆర్‌డీసీ కేంద్రాన్ని నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. శిక్షణ కార్యక్రమం సమన్వయ కర్త సాలమన్ బెన్ని మాట్లాడుతూ అధ్యాపకుల బోధన సామర్థ్యాలను పెంచేందుకు ఇటువంటి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. తరగతిలో వెనుకబడిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని అధ్యాపకుని బోధన సాగాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్‌ఎడీ పాల్, హరనాథ్, తదితరులు పాల్గొన్నారు. తెలుగు, హిందీ, సంస్కృతం, ఒడియా భాషలకు చెందిన అధ్యాపకుల శిక్షణ తరగతులకు హాజరయ్యారు.

విమ్స్‌కు రెండు అంబులెన్స్‌లు
* రూ.32 లక్షల ఎంపీ కోటా నిధులతో కొనుగోలు
ఆరిలోవ, నవంబర్ 21:విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (విమ్స్)కు రెండు అధునాతన అంబులెన్స్‌లు సమకూరాయి. విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు తన కోటా నిధులు రూ.31,92,328 ఖర్చుతో బీఎస్-4 మోడల్ అంబులెన్సులు కొనుగోలు చేసి, రోగుల సౌకర్యార్ధం ఏర్పాటు చేశారు. వీటిని ఎంపీ హరిబాబు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ హరిబాబు ఆసుపత్రిలో పలు విభాగాలను సందర్శించి పనితీరును పరిశీలించారు. ఆసుపత్రిలో వివిధ వార్డులు, ఓపీ విభాగం, అత్యవసర విభాగం, శస్త్ర చికిత్సల విభాగాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ కే సత్యవర ప్రసాద్, ఆర్‌ఎంఓ డాక్టర్ బీఎస్ చక్రవర్తి, హాస్పిటర్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ జీ రామకృష్ణ, నర్శింగ్ సూపరింటెండెంట్ హేమలత తదితరులు పాల్గొన్నారు.