విశాఖ

మరుగుదొడ్లు నిర్మించుకోకపోతే పథకాలు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, నవంబర్ 23: మండలంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోకపోతే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను నిలిపివేస్తామని స్థానిక వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ టి.రాజుబాబు హెచ్చరించారు. స్థానిక మండల మహిళా సమాఖ్య కార్యాలయ భవనంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు, మండల మహిళా సమాఖ్య సభ్యులకు మరుగుదొడ్ల నిర్మాణంపై గురువారం అవగాహన కల్పించారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంభం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని లేనిపక్షంలో ప్రభుత్వ పథకాలకు అర్హులు కారని పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో మరుగుదొడ్ల ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గిరిజనులను చైతన్యం చేసినప్పటికీ మరుగుదొడ్ల నిర్మాణంపై చాలా మంది ఆశక్తి కనబరచడం లేదని ఆయన అన్నారు. వెలుగు ఆధ్వర్యంలో మరుగుదొడ్లు మంజూరు చేయాలని కోరుతూ ఇంతవరకు నాలుగు వేల ఐదు వందల దరఖాస్తులు ఎం.పి.డి.ఒ.కు అందచేసామని ఆయన చెప్పారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన అనంతరం నూతన మరుగుదొడ్ల మంజూరుకు చర్యలు తీసుకుంటామని ఎం.పి.డి.ఒ. హామీ ఇచ్చారని ఆయన అన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోకుండా ఉన్నవారు తక్షణమే తమకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఒక్కొక్క మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు మంజూరు చేస్తున్నందున గిరిజనులు దీనిని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

చాపరాయి అభివృద్ధికి చర్యలు
డుంబ్రిగుడ, నవంబర్ 23: పర్యాటక కేంద్రమైన చాపరాయి జల విహరీ అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్టు పాడేరు సబ్ కలెక్టర్ డి.కె.బాలాజి చెప్పారు. చాపరాయి జలవిహార్‌ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకుల సౌకర్యార్థం 18 లక్షల రూపాయలతో మరుగుదొడ్లు, ప్రహారీ గోడ, వాహనాల పార్కింగ్ స్థలం వంటి పనులు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. చాపరాయి అభివృద్ధికి సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తున్న టెండర్ ద్వారా వచ్చిన నిధులను దీని అభివృద్ధికి వెచ్చించాలని ఆయన అన్నారు. మండలంలోని వ్యక్తిగత మరుగుదొడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాహశీల్ధార్ బాబుసుందరం, ఎస్.ఐ. అమ్మన్నరావు, వి.ఆర్.ఒ.లు తదితరులు పాల్గొన్నారు.