విశాఖపట్నం

అద్దెబస్సు డ్రైవర్ల జీతాలు పెంచుతూ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 23: ఆర్టీసీలో అద్దె బస్సులో పనిచేస్తున్న డ్రైవర్ల సమస్యలు ఎట్టకేలకు పరిష్కారమవుతున్నాయి. దశల వారీగా నిర్వహించిన ఆందోళనలు, చర్చల ఫలితంగా ఒక ఒప్పందం కుదిరింది. ఆర్టీసీలో అద్దె బస్సులో పనిచేస్తున్న డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని గత నాలుగు మాసాలుగా వివిధ రూపాల్లో వినతిపత్రాలు, ధర్నాలు, ఆందోళనలు నిర్వహించినట్టు ఆర్టీసీ హైర్ బస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు సంతోష్‌కుమార్, సిహెచ్.కృష్ణకుమార్ పేర్కొన్నారు. ఫలితంగా హైర్‌బస్సు వానర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు, హైర్‌బస్సు వర్కర్స్ యూనియన్ (సిఐటియు)కు మధ్య దశవారీగా జరిగిన చర్చలు అనంతరం ఒప్పందం జరిగిందన్నారు. ఈ ఒప్పందాన్ని వివరించడానికి హైర్‌బస్సు వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటి సమావేశం మద్దిపాలెంలో గురవారం జరిగింది. దీనికి సిఐటియు నగర అధ్యక్షులు ఆర్.కె.యస్.వి.కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒప్పంద వివరాలను కార్మికులకు వివరించారు. అద్దె బస్సులు డ్రైవర్లకు ప్రస్తుతం ఇస్తున్న జీతానికి అదనంగా రెండు వేలు పెంచేందుకు, ప్రతీ సంక్రాంతికి బోనస్‌గా మూడు వేలు మంజూరుకు అంగీకరించిందన్నారు. ప్రతీ డ్రైవర్‌కు ఏడాదికి రెండు జతలు యూనిఫాం, కుట్టుకూలి చెల్లించేందుకు, ప్రభుత్వ నిబంధనల మేరకు పిఎఫ్, ఇఎస్‌ఐ చెల్లించేందుకు, నైట్‌హాల్ట్ బస్సు డ్రైవర్‌కు బేట రూ.50లు, కార్మికులందరికీ గుర్తింపుకార్డులు ఇచ్చేందుకు అంగీకరించినట్టు ఆయన తెలిపారు. అలాగే మిగిలిన విషయాలపై ఆర్టీసీ ఎండి సూచనలపై తదుపరి అంశాలను చర్చిస్తామన్నారు. ఈ ఒప్పందం నవంబర్ ఒకటవ తేదీ నుంచి 2019 అక్టోబర్ 31వ తేదీ వరకు అమల్లో ఉంటుందన్నారు. ఈ విషయానికి కారణమైన డ్రైవర్లకు, పర్మినెంట్ ఉద్యోగులకు, సహకరించిన వారందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్మికులంతా ఐక్యంగా ఆందోళన చేస్తే ఖచ్చితంగా విజయాలు సాదిస్తామన్నారు. జిల్లాలో వివిద డిపోల్లో పనిచేస్తున్న అద్దెబస్సుల డ్రైవర్లంతా సంఘంలో చేరి మరిన్ని హక్కులు సాధించేందుకు సిద్ధం కావాలన్నారు. ఈ చర్చల్లో అద్దెబస్సుల వానర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సి.హెచ్.వి రాఘవేంద్రకుమార్, ఎమ్.పార్వతీశంట, హైర్ బస్సు వర్కర్స్ యూనియన్ నుంచి సిఐటియు నగర అధ్యక్షుడు ఆర్.కె.యస్.వి.కుమార్, ఎస్.డబ్ల్యూ.ఎఫ్ గౌరవ అధ్యక్షుడు ఎన్.రాజేంద్రప్రసాద్, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

గీతంలో రక్షణ పరిశోధనా సంస్థ డ్రూన్’ కార్యక్రమం
జగదాంబ, నవంబర్ 23: భారత ప్రభుత్వ రక్షణ పరిశోధనా సంస్ఢ డిఆర్‌డిఓ వజ్రోత్సవాల సందర్భంగా దేశంలోని ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు (డిఆర్‌డిఓ) రోబోటిక్స్ అండ్ ఆన్ మ్యాన్డ్ సిస్టమ్స్ ఎక్స్‌పోజిషన్ డ్రూస్ పేరిట అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోందని డిఆర్‌డిఓ శాస్తవ్రేత్తలు పాల్గొన్నారు. పర్వతాలు ఆధిరోహించడం, మంచు పర్వతాల్లో రక్షణదళాలకు సహయపడటంలో ఉపయోగపడే మానవరహిత యుద్ధసామాగ్రి, రోబోలను తయారు చేయడాన్ని డిఆర్‌డిఓ ప్రోత్సహిస్తోందన్నారు. అలాగే విద్యార్థులకు వివిధ అంశాల్లో నిర్వహిస్తున్న పోటీలను వివరించారు. గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి.్ధర్మరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి ప్రొఫెసర్ ఎమ్‌ఆర్‌ఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.