విశాఖపట్నం

బడి రుణం తీర్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునగపాక, డిసెంబర్ 10: ప్రతీ ఒక్కరూ తాము చదువుకున్న బడి రుణం తీర్చుకునే బాధ్యతను విధిగా చేపట్టాలని నన్నయ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ ఎం. ముత్యాలనాయుడు హితవు పలికారు. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పదో తరగతి 1981-82 బ్యాచ్ పూర్వపు విద్యార్థులు 35 ఏళ్ల తరువాత ఈ స్కూల్‌లో కలుసుకున్నారు. భార్యా పిల్లలతోపాటుగా ఆడ, మగ అంతా కలిసి ఒకరితో ఒకరు అనుభవాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిధిగా విచ్చేసిన నన్నయ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ ముత్యాలనాయుడు మాట్లాడుతూ తాము చదువుకున్న స్కూల్ అభ్యున్నతికి తమవంతు తోడ్పాటును అందించాలని కోరారు. విశాఖపట్నం పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపాల్ భీమరశెట్టి లక్ష్మణరావు మాట్లాడుతూ మునగపాక హైస్కూల్‌లో చదివిన వారు దేశవిదేశాల్లో అన్నిరంగాల్లోను అత్యున్నత స్థాయిలో ఉన్నారన్నారు. వారంతా ఈ స్కూల్ అభివృద్ధికి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ స్కూల్‌లో చదువుకున్న తాను పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా ఉండ టం గర్వకారణంగా ఉందన్నారు. రిటైర్డ్ డిప్యూటీ డిఇవో గౌరీపతితోపాటు ఈ స్కూల్‌లో ఆనాడు పాఠాలు బోదించిన పలువురు ఉపాధ్యాయులను పూర్వపు విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంకు పాఠశాల పూర్వపు విద్యార్థులు భీమరశెట్టి నాగేశ్వరరావు, ఆడారి మహేష్, మళ్ల రాము, ఆడారి సన్యాశిరావు, శరగడం జగ్గ అప్పారావు తదితరులు నేతృత్వం వహించారు.