విశాఖపట్నం

కొంప ముంచిందినిర్లక్ష్యమే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 10: యారాడ కొండపై శనివారం సాయం త్రం చోటుచేసుకున్న బస్సు ప్రమాదం పూర్తిగా డ్రైవర్ల నిర్లక్ష్యంగా యంత్రాంగం నిర్ధారణకు వచ్చింది. అనకాపల్లికి చెందిన ఒక ప్రైవేటు పాఠశాల నాలుగు బస్సుల్లో విద్యార్థులను యారాడ కొండకు విహారయాత్ర నిమిత్తం తీసుకువచ్చారు. విహారయాత్ర అనంతరం తిరిగి వెళ్తున్న సందర్భంలో మూడు బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో 70 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో కొంతమంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బస్సు ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, నగర పోలీసు కమిషనర్ యోగానంద్, రవాణాశాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వర్లు సహా పలువురు అధికారులు ఆదివారం సమావేశమై చర్చించారు. తొలుత బస్సుకు బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ప్రమాదం చోటుచేసుకుందని డ్రైవర్ చెప్పిన అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారు. అయితే రవాణాశాఖ అధికారులు ప్రమాదానికి గురైన బస్సులను పరిశీలించిన అనంతరం జరిగిన ఘటనకు బ్రేక్ ఫెయిల్ కారణం కాదని నిర్ధారణకు వచ్చారు. బస్ డ్రైవర్ల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా నిర్ధారణకు వచ్చారు. ముందు వెళ్తున్న బస్ హఠాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుకగా వస్తున్న బస్సులు ఒకదానికొకటి ఢీ కొన్నట్టు వెల్లడైందన్నారు. ముందున్న బస్ షడెన్ బ్రేక్ వేయడం వల్ల వెనుక వస్తున్న బస్‌లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. మధ్యలో ఉన్న బస్ ముందున్న బస్‌ను ఢీకొనగా, మూడో బస్‌ను మధ్య బస్‌ను వెనుక నుంచి ఢీకొంది. దీంతో మధ్యలో ఉన్న బస్ విద్యార్థులు ఎక్కువ మంది గాయాలపాలైనట్టు గుర్తించారు. రన్నింగ్‌లో బస్‌లు తగిన ఎడం పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందన్న నిర్ధారణకు వచ్చారు. కనీసం 25 అడుగుల దూరంలో బస్‌లు నడవాల్సి ఉంటుందని, అయితే ప్రమాదానికి గురైన బస్‌ల మధ్య ఈ దూరం లేదని గుర్తించినట్టు రవాణాశాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. దీనిపై పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేయనున్నట్టు ఆయన ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. బస్ కండిషన్ బాగానే ఉందని, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటుచేసుకున్నట్టు ఆయన వెల్లడించారు.