విశాఖ

తాగునీటి ప్రాజెక్టు కట్టనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాకవరపాలెం, ఏప్రిల్ 28: తాగునీటి ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టనివ్వబోమని మండలంలోని లచ్చన్నపాలెం గ్రామస్థులు స్పష్టం చేశారు. మండలంలోని లచ్చన్నపాలెం సమీపం లోగల సర్పానదిలో తాగునీటి ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం ఎనిమిది పంచాయతీలకు చెందిన 13 గ్రామాల కు తాగునీటిని అందించేందుకు ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేసిన స ంగతి తెలిసిందే. దీనిపై గత వారం రోజుల నుంచి ఎనిమిది పంచాయతీల గ్రామపెద్దలు తాగునీటి ప్రాజెక్టును నిర్మించేందుకు సహకరించాలని లచ్చన్నపాలెం గ్రామస్థులతో చర్చించారు. దీనిపై ఆర్.డబ్ల్యు ఎస్. ఎ.ఇ.రాజేష్ గత రెండు రోజుల క్రితం తాగునీటి ప్రాజెక్టు నిర్మాణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సై రమేష్, ఆర్.డబ్ల్యు. ఎ స్. ఎ.ఇ. రాజేష్ గురువారం గ్రామంలోకి వెళ్ళి గ్రామస్థులతో చర్చించారు. ఇది ప్రభు త్వ పథకమని, దీనిని ఎవరూ అడ్డుకోరాదని ఎస్సై గ్రామస్థులకు చెప్పారు. ఇ క్కడ తాగునీటి ప్రాజెక్టు నిర్మించేందుకు వీల్లేదని అంటూ పలువురు మహిళలు ఎస్సైతో ఘర్షణకు దిగారు. తాగునీటి ప్రాజెక్టు ఇక్కడ నిర్మిస్తే తమ పంట పొ లాలకు నీరందించే వ్యవసాయ బోర్లు అడుగంటిపోతాయని గ్రామస్థులు స్పష్టం చేశారు.