విశాఖ

భవానీ భక్తుల కోసం అదనపు సౌకర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 12: పలు ప్రాంతాల నుంచి తరలివెళ్ళే భవానీ భక్తుల కోసం విశాఖపట్నం-విజయవాడల మధ్య ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వాల్తేరు డివిజన్ అధికారులు ప్రత్యేకరైలును ప్రవేశపెట్టారు. రద్దీని తట్టుకునేందుకు వీలుగా పట్టాలెక్కించిన దీనిని సద్వినియోగపర్చుకోవాల్సిందిగా డివిజన్ అధికారులు ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. విజయవాడ-విశాఖపట్నం (07025) మధ్య ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేకరైలు విజయవాడలో ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8.15గంటలకు బయలుదేరుతుంది. ఇది విశాఖపట్నంకు మధ్యాహ్నం మూడు గంటలకు చేరుతుంది. వరుసగా ఎనిమిది రోజులుపాటు దీనిని నిర్వహిస్తున్నారు. అలాగే ఇదే ప్రత్యేక రైలు విశాఖపట్నం-విజయవాడల మధ్య ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమై 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇది విశాఖపట్నంలో ప్రతిరోజు మధ్యాహ్నం 3.45 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు వెళ్తుంది. ఇది ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారకాపూడి, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, యలమంచిలి, నర్సింగబిల్లి, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్ల మీదుగా నడువనుంది. పది కోచ్‌లతో ఇది నడుస్తుంది.

మెస్ నిర్వాహణపై రగడ
* ఆందోళన చేస్తున్న న్యాయ కళాశాల విద్యార్థులు
విశాఖపట్నం, డిసెంబర్ 12: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాల విద్యార్థులు తలదాచుకునే సమతమమత హస్టల్ సమస్యలకు నిలయంగా మారింది. దీంతో అక్కడ ఉన్న విద్యార్థులు వసతిగృహం అద్వాన్నంగా ఉందంటూ ఏయూ ప్రధాన ముఖ ద్వారం వద్ద నిరసనకు దిగారు. ఈ హాస్టల్‌లోలో మొత్తం 250 మంది విద్యార్థులు ఉంటున్నారన్నారు. వారంతా న్యాయ కళాశాలకు సంబంధించినవారు. వీరిలో ఇంటిగ్రేటెడ్ న్యాయ కళాశాల విద్యార్థులు, పీజీ, న్యాయ కళాశాల విద్యార్థులు హ్యూమన్ రైట్స్ కోర్సు విద్యార్థులు ఉన్నారు. ఇటీవల హస్టల్ వార్డెన్ సత్యనారాయణ మరణానంతరం ఆ బాధ్యతలను న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సూర్యప్రకాశరావుకు అప్పగించడం జరిగిందన్నారు. ఇందులోభాగంగా విద్యార్థులు మాట్లాడుతూ కనీస వసతులు కనీస వసతులు లేక చివరకు శుభ్రమైన నీరు కూడా కరువై విద్యార్థులంతా ఇబ్బందులు పాలవుతున్నామన్నారు. ఎన్నిసార్లు విన్నవించుకన్నా ఫలితం లేకపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. వారి ప్రధానమైన డిమాండ్లను వర్సిటీ ఉపకులపతి తక్షణమే సమస్యలు పరిష్కరించాలన్నారు. సమస్యల్లో ప్రధానంగా నాసిరకం భోజనం, విద్యుత్ సౌకర్యాలు లేమి, అనధికారికంగా నివాసం ఉంటున్న విద్యార్థులు, పరిశుభ్రమైన నీరు లభించకపోవడం, వంటి ప్రధానమైనవిగా ఉన్నాయన్నారు. వసతి గృహాల్లో నెలవారి ఖర్చులు మాత్రం విద్యార్థులపై భారం మోపుతున్నా, భోజనం మాత్రం తినడానికి చాలా ఇబ్బందిపడాల్సి వస్తుందన్నారు. సమతమమత వసతి గృహం మరమ్మతులకు గురైన ఎవరు పట్టించుకోవడంలేదన్నారు. తక్షణమే వర్సిటీ యాజమాన్యం చొరవ తీసుకుని వారికి న్యాయం చేయాలన్నారు.