విశాఖపట్నం

ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్యీర్యం చేయడానికి చంద్రన్న మాల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగకా చంద్రన్నమాల్స్‌ను ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలను ఏపీ స్టేట్ సివిల్ సప్లయిస్ హమాలీస్ యూనియన్ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో కోట్లాది మంది బడుగు, బలహీన వర్గాలకు ఆహార ధాన్యాలు సబ్సిడీకి ఇచ్చే మహాత్తర పథకం ప్రజాపంపిణీ వ్యవస్థగా యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం.మన్మధరావు తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు 14 నిత్యావసర వస్తువులు గత కాంగ్రెస్ హయాంలో ఇచ్చేవారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత బియ్యం, పంచదార, కిరోసిన్‌ను ఎత్తివేసి బియ్యం ఒక్కటే ప్రజలకు అందిస్తున్నారన్నారు. దానిని కూడా ఎత్తివేయడానికి ప్రభుత్వం పన్నాగాలు పన్నుతుందన్నారు. ఇపుడు కొత్తగా రిలయన్స్, హెరిటేజ్ సంస్థల్లో ప్రభుత్వం కుమ్మక్కై చంద్రన్న మాల్స్ తీసుకుని వచ్చి వారి వ్యాపార అభివృద్ధికి తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తుందన్నారు. ఈ చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.ప్రజలకు బియ్యం అవసరం లేకపోతే చంద్రన్నమాల్స్‌లో ఎక్కువ సొమ్ము చెల్లించి సరుకులు తీసుకోవాలన్నారు. ఈ చర్యలు మానుకొని ప్రజలకు రేషన్ డిపోల ద్వారానే 14 నిత్యావసర వస్తువులు సరఫరా చేసే విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. లేనిపక్షంలో పోరాటాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.