విశాఖ

త్రిడి ప్రింటింగ్‌పై గీతంలో వర్క్‌షాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (జగదాంబ), డిసెంబర్ 14: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం మెకానికల్ ఇంజనీరిగ్ విభాగం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో త్రీడి ప్రింటింగ్‌పై మూడు రోజులపాటు జరిగే వర్క్‌షాపును ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.లక్ష్మీప్రసాద్ గురువారం ప్రారంభించారు. వస్తు ఉత్పాదిక రంగంలో అనవసర వ్యయాన్ని తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా త్రీడి ప్రింటింగ్‌ను ఉపయోగిస్తున్నారన్నారు. ఎయిరోస్పేస్, ఆటోమొబైల్ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమలు, బయోమెడికల్ రంగంలో త్రీడి ప్రింటింగ్‌కు ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. కార్యక్రమానికి రిసోర్స్‌పర్సన్‌గా ఎన్‌ఐటి వరంగల్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వై.రవికుమార్ హాజరయ్యారు. త్రీడి ప్రింటింగ్ ఆధారంగా వికలాంగులకు వ్యక్తిగత శారీరక కొలతల ఆధారంగా ఉపకరణాలు తయారు చేయడం, దంత వైద్య రంగంలో ఎవరికి వారికి అనువైన కట్టడం పళ్ళ వంటివి రూపొందించడం అలాగే కృత్రిమ అవయువాలను తయారు చేయడం పెరుగుతోందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి ప్రొఫెసర్ ఎమ్.ఆర్.ఎన్.సత్యనారాయణ మాట్లాడుతూ త్రీడి ప్రింటింగ్ పరిజ్ఞానంతో మెకానికల్ తదితర ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన విద్యార్థులు స్టార్టప్ కంపెనీలను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్ ఆర్.్భనుపవన్ తదితరులు పాల్గొన్నారు.

గీతం యువజనోత్సవం నిర్వహణ సన్నాహాలు
విశాఖపట్నం, డిసెంబర్ 14: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు నిర్వాహాకులుగా వ్యవహరిస్తూ ఈ నెల 15, 16 తేదీల్లో జరపనున్న ‘గీతం ఎక్స్‌లెన్స్ మీట్-2017’కు సన్నాహాలు గురువారం ప్రారంభమయ్యాయి. జెమ్ పేరిట జరిగే ఈ యువజనోత్సవం ఉద్దేశాన్ని తెలియజేస్తూ విద్యార్థులు స్వయంగా స్వరపరిచిన గీతాలకు హుషారుగా నర్తిస్తూ గీతం ఆవరణలో ఫ్లాష్‌మాబ్‌ను నిర్వహించారు. యువజనోత్సవంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తూ ఫ్లాష్‌మాబ్‌తో ఆకట్టుకున్నారు. అనంతరం గీతం ఆవరణలో ఆకాశదీపాలను ఎగురవేస్తూ సందడి చేశారు. శుక్రవారం ఉదయం ప్రారంభం అయ్యే ఈ యువజనోత్సవంలో దాదాపు 15వేల మందికి పైగా వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొనున్నారని ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.షీలా తెలిపారు.

ఉత్సాహంగా గీతం అంతర్ కళాశాలల క్రికెట్ పోటీ
విశాఖపట్నం (జగదాంబ) డిసెంబర్ 14: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో గీతం వైద్య కళాశాల మైదానంలో బుధవారం ప్రారంభమైన అంతర్ కళాశాలల క్రికెట్ పోటీలు నాకౌట్ పద్ధతిలో ఉత్సాహంగా సాగుతున్నాయి. పోటీల్లో రెండవరోజైన గురువారం గీతం టెక్నాలజీ జట్లు పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచాయి.
* సెమీ ఫైనల్స్ ఫలితాలు:
రెండవ రోజు జరిగిన సెమీఫైనల్స్‌లో గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ జట్టుపై గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ‘బి’ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ జట్టు 18 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 133 పరుగులు చేయగా గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ‘బి’ జట్టు 17.3 ఓవర్లలో కేవలం అయిదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని అధిగమించి విజయం సాధించింది. రెండవ సెమీ ఫైనల్ పోటీలో గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరు జట్టుపై గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ‘ఏ’ జట్టు విజయం సాధించింది. పోటీల్లో చివరి రోజైన శుక్రవారం గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ‘బి’ జట్టులో ‘ఎ’ జట్టు తలపడుతుందని స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు.