విశాఖ

ఇంధన పొదుపు వారోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 14: ఇంధన పొదుపు వారోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. విద్యుత్ ఆదా చేయడం ద్వారా మాత్రమే విద్యుత్ కొరత నుండి ఉపశమనం పొందవచ్చని భావిస్తోన్న ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపీడీసీఎల్) ఈ క్రమంలో చర్యలు చేపట్టింది. ఈ వారోత్సవాల ద్వారా ప్రతిఒక్కరిలో అవగాహన కల్పించడం ద్వారా ఫలితాలు సాధించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం విద్యుత్ సరఫరాకు, డిమాండ్‌కు మధ్య వ్యత్యాసం ఉహించని విధంగా పెరుగుతుంది. ఇప్పటికిపుడు కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కనీసం ఐదేళ్ళకాలం పడుతుంది. బయట నుండి అధిక ధరలకు కొనుగోలుచేయడం వ్యయంతో కూడుకున్నదే. అలాగే ట్రాన్స్‌మిషన్ లైన్ ఏర్పాటు చేయడానికి కనీసం ఏడాది కాలం పడుతుంది. అయితే విద్యుత్‌ను ఆదాయ చేయడానికి ఒక సెకండ్ సరిపోతుందనే ఆలోచనను వినియోగదారుల్లోకి తీసుకువెళ్ళాలని సంస్థ నిర్ణయించింది.
ఈసారి ప్రధానంగా ఇంధన పొదుపునే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఒక్క సెకన్ ఆదా చేస్తే విద్యుత్ కొరత నుంచి ఉపశమనం పొందవచ్చునని సంస్థ భావిస్తోంది. ఇంధన ఆదా, ఇంధన పొదుపు పాటించడం వలన గృహ, వ్యవసాయ, పరిశ్రమల రంగాల్లో విద్యుత్ వృదాను అరికట్టేందుకు వీలుంటుంది. తద్వారా ప్రజలు, రాష్ట్రం లబ్ది పొందవచ్చని సంస్థ పేర్కొంది. రాబోయే కాలంలో విద్యుత్ అవసరాలను దృష్టిలోపెట్టుకుని ఇంధన పొదుపు చర్యల అవశ్యకతను ప్రజలకు తెలియజేసేందుకు ఇంధన పొదుపు వారోత్సవాలను గురువారం ప్రారంభం కాగా, వీటిని ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు సంస్థ ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ టి.వి. సూర్యప్రకాష్ నేడొక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ పొదుపు చర్యలు పాటించడం ద్వారా పరోక్షంగా ఎక్కువ విద్యుత్ పారిశ్రామిక రంగానికి వ్యవసాయ రంగానికి అందుబాటులో ఉండే తద్వారా ఉత్పత్తి పెరిగే రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు. వినియోగదారులు తమ ఇంటిలో వినియోగిస్తున్న విద్యుత్ ఉపకరణాల స్థానంలో నాణ్యమైన విద్యుత్‌ను తక్కువుగా ఉపయోగించుకునే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్స్ ఐదు నక్షత్రాల గుర్తుగల (బిఈఈస్టార్ రేటెడ్) విద్యుత్ ఉపకరణాలను వినియోగించడం ద్వారా విద్యుత్‌ను ఆదా చేసుకోవచ్చన్నారు.