విశాఖ

రూ.157 కోట్ల పన్నులు వసూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 14: ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ 221 కోట్ల రూపాయల ఆస్థి పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఇందులో ఇప్పటి వనరకూ 157 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ తెలియచేశారు. ఇప్పటి వరకూ 67 శాతం పన్ను వసూలు చేసినట్టు ఆయన చెప్పారు. కమిషనర్ తన ఛాంబర్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకూ రెండవ అర్థ సంవత్సరం పన్ను చెల్లించని యజమానులు ఈనెల 31 వరకూ ఎటువంటి వడ్డీ లేకుండా చెల్లించవచ్చని సూచించారు. నీటి చార్జీలు చెల్లించేందుకు కూడా ప్రజలు ముందుకు రావాలని ఆయన కోరారు. ప్రధానంగా ఖాళీ స్థలం పన్ను చెల్లించే విషయంలో యజమానులు సరైన డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని అన్నారు. స్థల యజమానులు వేరే ప్రాంతాల్లో ఉండడం వలన ఆయా స్థలాల్లో మొక్కలు, చెత్తా పేరుకుపోయి, చుట్టుపక్కల ఇళ్ళవారు ఇబ్బంది పడుతున్నారని కమిషనర్ చెప్పారు. ఖాళీ స్థల యజమానులు వెంటనే వీఎల్‌టీ చెల్లించి స్థలాన్ని పరిరక్షించుకోవాలని ఆయన సూచించారు. జోన్-1,5,6ల్లో ఖాళీ స్థలాలు అధికంగా ఉన్నాయని అన్నారు. స్థల మార్కెట్ విలువలో 0.5 శాతం వీఎల్‌టీ చెల్లించాలని, ఇప్పటి వరకూ ఈ పద్దు కింద 10 కోట్ల రూపాయలు వసూలైందని ఆయన తెలియచేశారు. ఇదిలా ఉండగా జీఐఎస్ ద్వారా 35 వేల ఇంటి అసెస్‌మెంట్లను గుర్తించామని, పన్నుల పరిధిలోకి రాని 11 వేల అసెస్‌మెంట్లకు నోటీసులు పంపించామని కమిషనర్ తెలియచేశారు. రెసిడెన్షిల్ భవనాలను కమర్షియల్ వాడకాలను వినియోగిస్తున్నారని, వీటికి కూడా కమర్షియల్ కేటగిరిలో పన్నులు విధిస్తామని ఆయన తెలియచేశారు. జీవీఎంసీ కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే రెండున్నర కోట్ల ఈఎండీలు చెల్లించామని, మరో ఏడున్నర కోట్లు త్వరలోనే చెల్లిస్తామని ఆయన చెప్పారు. నగర పరిధిలో తడి పొడి చెత్త వేరు చేయాల్సిందేనని ఏడాదిగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని కమిషనర్ హరినారాయణన్ చెప్పారు. ఈ చెత్తను వేరు చేసే ర్యాక్ పికర్స్ ప్రతి ఇంటి నుంచి 50 రూపాయలు వసూలు చేసుకోవచ్చని అన్నారు. ఇదే జీవీఎంసీ ఉద్యోగులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఇదిలా ఉండగా హనుమంతవాక కబేళాకు రెండు నెలలే గడువు ఇచ్చమని, ఈ కబేళాను కొనసాగించాలని వ్యాపారులు కోరుతున్నారని, కలెక్టర్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి మారికవలసలో ఉన్న ఆధునిక కబేళాను భీమిలి జోన్1,2,3,4 వ్యాపారులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. జోన్-5,6 వ్యాపారులకు గాజువాకలో ఆధునిక కబేళా నిర్మించి ఇస్తామని చెప్పారు. రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వారికి హాకర్ జోన్‌లు ఏర్పాటు చేస్తామని, దీనివలన ఫుట్ పాత్‌ల ఆక్రమణతోపాటు, ట్రాఫిక్ ఇక్కట్లు కూడా తొలగిపోతాయని ఆయన చెప్పారు.