విశాఖపట్నం

అమ్మవారి దేవాలయంలో భక్త జనసందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 26: విశాఖ నగరంలో శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీన ప్రారంభమైన మార్గశివ మాసోత్సవాలు 15వ రోజుకి చేరుకున్నాయి. శ్రీ అమ్మవారి పంచామృతాభిషేకం, శ్రీ చక్రనవవర్ణార్చన విశేష కంకుమపూజ, శ్రీ లక్ష్మీపూజ, వేదపారాయణ, సప్తశతీపారాయణ, లక్ష్మీహోమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శ్రీ అమ్మవార్ని దర్శించుకున్నారు.
* సాంస్కృతిక కార్యక్రమం
మార్గశిరమాసం నెల రోజులు వచ్చేనెల 10వ తేదీ వరకు సాయంత్రం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీనిలోభాగంగా శనివారం రమణీ నిర్వహించిన అన్నమాచార్య కీర్తనలు భక్తులను అలరింపచేశాయి.
* శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి రధయాత్ర
ఆంధ్ర భక్తజనుల కల్పవల్లి, సత్యంగల తల్లి విశాఖ నగరవాసుల ఆరాధ్య దైవం శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి రధోత్సవం శనివారం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ సాయంత్రం ఐదు గంటలకు జ్యోతి ప్రజ్వలన చేసి రథోత్సవం ప్రారంభించారు. ఈ రథోత్సవం శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దత్తత దేవాలయమైన శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం, శ్రీ అంబికాబాగ్ నుండి ప్రారంభమై జగదాంబ, పూర్ణామార్కెట్, కాలేజ్‌డౌన్, కొత్తరోడ్ రీడింగ్ రూమ్ మీదుగా శ్రీ అమ్మవారి దేవస్థానానికి చేరింది. ఈ రథయాత్రలో పులివేషాలు, తప్పెటగుళ్ళు, కోలాటం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. దీనికి ఆలయ కార్యనిర్వాహాణాధికారి ఉప కలెక్టర్ యస్‌జె మాధవి అన్ని విభాగాలకు స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యానిర్వాహణాధికారిణి, భక్త జన సేవ కమిటి చైర్మన్ డబ్ల్యూ,్భస్కరరావు, ఇతర సభ్యులు ఆలయ ఉప కార్యనిర్వాహక ఇంజనీరు హెచ్‌వి రమణ సహాయ కార్యనిర్వాహణాధికారి వి.రాంబాబు, ఎస్.సూర్యకుమారి, పర్యవేక్షకులు పి.రామారావు, ఎస్‌వివిఎస్‌ఎస్‌విఎన్ రాజు, సహాయ ఇంజనీరు కెఎస్‌ఎస్ మూర్తి పాల్గొన్నారు.

గంగమ్మకు పూజలు
విశాఖపట్నం, డిసెంబర్ 26: ప్రకృతి విలయం ఎంతటి ప్రళయాన్ని సృష్టిస్తుందో చెప్పనలవి కాదు. 2004 డిసెంబర్ 26న సుమత్రా దీవిలో సంభవించిన సునామీ సృష్టించిన విలయం ఇప్పటికీ చేదు జ్ఞాపకాల నుంచి చెదిరిపోదు. ఆనాటి ప్రకృతి బీభత్సం భవిష్యత్‌లో ఎదురుకాకూడదని, భగవంతుని కోరుతూ ఇప్పటికీ పూజలు చేస్తూనే ఉన్నారు. సునామీ చేదు జ్ఞాపకాల నుంచి తేరుకున్న ప్రజానీకం డిసెంబర్ 26న గంగమ్మకు భక్తితో పూజలు చేయడం జరుగుతోంది. దీనిలో భాగంగా విశాఖ సాగర తీరంలో వందలాది మంది మహిళలు, మత్స్యకారులు చల్లంగ చూడాలి గంగమ్మ అంటూ పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన మహిళలు గంగమ్మను కొలిచారు. వేల సంఖ్యలో మహిళలు బిందెలతో నీళ్లను తెచ్చి అభిషేకించారు. ప్రకృతి విలయం నుంచి కాపాడాలని, ప్రార్ధనలు చేశారు.