విశాఖపట్నం

జన్మభూమిలో ప్రజలను భాగస్వాములు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 26: జన్మభూమిలో ప్రజలను భాగస్వాములను చేసి విజయవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాప్రతినిధులకు, అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన వీడియో కానె్ఫరెన్స్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు, జెసి నివాస్, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చౌకధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీకి ఈ-పాస్ విధానం ప్రవేశపెట్టామని, దీనిలో ఉన్న సాంకేతికలోపాలు తొలగించి ప్రజలకు సక్రమంగా సరుకులు పంపిణీ అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ నిధులతో ఆర్ అండ్ మి పంచాయితీరాజ్ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణాలు చేపట్టాలన్నారు. జనవరి నెలాఖరు తరువాత రోడ్లపై గోతులు కనిపించినట్లయితే ఏఇలు, జెఇలు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో భారీగా మార్పులు తీసుకు వస్తారని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో వివిధ రకాల పరీక్షలు డయాగ్నస్టిక్ సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించామన్నారు. రాష్ట్రంలో పశువులకు సంబంధించిన వైద్య సేవలు అందించేందుకు 102 సేవలు ప్రవేశ పెడుతున్నామని, దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. జన్మభూమి గ్రామసభల్లో ఈ-పాస్ విదానంపైన సరుకులు పంపిణీపైన చర్చించాలని సూచించారు. రేషన్‌కార్డుల్లో రెండు రకాల కార్డులు ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నామని, దీనిలోభాగంగా కేవలం రేషన్ ప్రయోజనాలు, రేషన్ మినహా ఇతర ప్రయోజనాలు కావాల్సినవారు తదితర కేటగిరీలుగా కార్డులను అందజేయాలని ఆలోచన చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. గ్రామసభలో దీనిపై విస్తృతంగా చర్చించాలన్నారు. రాష్ట్రంలో వివాదాలకు తావులేని భూ సంబంధిత కార్డులను రూపొందించే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం అవసరాలను ఏర్పాటు చేయాలని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇకపై ప్రతినెల భూగర్భ జలాలను పరిరక్షణ చేయాలన్నారు. వర్షాకాలం అనంతరం మూడు అడుగులు, వర్షాకాలం ప్రారంభానికి ముందు ఎనిమిది అడుగులు నీటి మట్టం ఉండేలా కనీసం ఐదు అడుగుల భూగర్భ జలాల మట్టాలను 450 టిఎంసిల నీటిని సమకూర్చగలిగే అవకాశం ఉందన్నారు. ఈ వీడియో కానె్ఫరెన్స్‌లో రాష్ట్ర మానవ వనరులశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ జె.నివాస్, పార్లమెంట్ సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, పీలా గోవింద సత్యనారాయణ, పి.విష్ణుకుమార్‌రాజు, గణబాబు, జిల్లాప్రజాపరిషత్ చైర్‌పర్సన్ లాలం భవానీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఉత్సవ్‌తో అరకుకు పండుగ శోభ
అరకులోయ, డిసెంబర్ 26: గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను బాహ్య ప్రపంచానికి చాటి చెప్పేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అరకు ఉత్సవ్‌తో అరకులోయ పట్టణంలో పండుగ శోభ సంతరించుకుంది. గిరిజనుల సమస్యలు పరిష్కరించకుండా ఉత్సవ్ నిర్వహిస్తే అడ్డుకుంటామని వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ప్రకటించినా ప్రభుత్వం మాత్రం పోలీసు బలగాలను మోహరించి నిర్వహిస్తున్న అరకు ఉత్సవ్ విజయవంతంగా కొనసాగుతుంది. పోలీసుల పహరా నడుమ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం అరకు ఉత్సవ్‌ను ప్రారంభించారు. అరకు ఉత్సవ్ ప్రారంభం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి గిరిజన గ్రామాల నుంచి అశేష సంఖ్యలో గిరిజనులు, పర్యాటకులు హాజరై ప్రభుత్వం నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలను తిలికిస్తున్నారు. అరకు ఉత్సవ్‌లో పర్యాటకులు, గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొంటుండడంతో ఈ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ మావోయిస్టులు ఈ నెల 26వ తేదిన ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చినప్పటికీ దీని ప్రభావం ఉత్సవ్‌పై ఏమాత్రం కానరాలేదు. మావోయిస్టుల బంద్ విఫలం కావడంతో ఉత్సవ్‌కు వచ్చే పర్యాటకులు, గిరిజనుల సంఖ్య రెండో రోజు శనివారం కూడా కొనసాగింది. అరకు ఉత్సవ్‌ను బహిష్కరించాలని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు గిరిజనులకు పిలుపునిచ్చినప్పటికీ ఈ ప్రాంత వాసులు మాత్రం దీనిని పట్టించుకోనట్టే కనిపిస్తోంది. ఉత్సవ్‌లో ప్రదర్శించే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకునే విధంగా ఉంటుండడంతో ఎక్కడ లేని వారు వీటిని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ఉత్సవ్ వేదిక వద్దకు చేరుకుంటున్నారు. దీంతో సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అరకులోయ రహదారులన్నీ జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రస్తుతం శీతాకాలంలో చలి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ గిరిజనులు దీనిని కూడా లెక్కచేయకుండా తమ గ్రామాల నుంచి అరకులోయ వస్తూ అరకు ఉత్సవ్‌ను తిలకిస్తుండడం విశేషంగా చెప్పాలి. అరకు ఉత్సవ్‌ను ఎట్టి పరిస్థితులలోనూ నిర్వహించరాదని, ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాకే ఉత్సవ్ కోసం ఆలోచించాలని రాజకీయ, ప్రజా పక్షాలు అనేకసార్లు హెచ్చరించడంతో ప్రభుత్వం ఆదిలో ఉత్సవ్ నిర్వహణపై సందిగ్ధంలో పడింది. అయితే ప్రతీసారి అరకు ఉత్సవ్ వాయిదాల పర్వంతో నడుస్తుండడంతో ఈ సారి ఎలాగైనా దీనిని నిర్వహించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండి ప్రజా సంఘాల ఆందోళనను తిప్పికొట్టేవిధంగా పోలీసు బలగాలను అధికంగా మోహరించి ఉత్సవ్ నిర్వహణకు పూనుకున్నారు. అయితే రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు దీనిని వ్యతిరేకిస్తూ గ్రామాలలో ప్రచారం చేయడంతో ఉత్సవ్‌కు గిరిజనుల హాజరు ఏ వరకు ఉంటుందన్నది మొదటిలో ప్రశ్నార్థకంగా మారింది. గిరిజనులు ఉత్సవ్‌లో పాల్గొనకపోతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అరకు ఉత్సవ్ అబాసుపాలై ఉండేదని పలువురు భావించారు. అయితే అందరి ఊహలకు భిన్నంగా గిరిజనుల నుంచి అరకు ఉత్సవ్‌కు మద్దతు లభించడంతో శని, ఆదివారాలలో అరకు ఉత్సవ్‌ను మరింత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉత్సవ్‌లో ఆకట్టుకుంటున్న సాంస్కృతిక ప్రదర్శనలు
అరకులోయ, డిసెంబర్ 26: అరకు ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. విజయనగరం, బొబ్బిలి, చిత్తూరు, రాజమండ్రి తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులతో పాటు గిరిజన కళాకారులతో సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు ప్రదర్శిస్తున్న పలు కార్యక్రమాలను స్థానికులు, పర్యాటకులను అలరిస్తున్నాయి. అరకు ఉత్సవ్‌లో తప్పెటగుళ్లు, మయూర నృత్యం, బిందెల డ్యాన్స్, కూచిపూడి బాలెట్, తీన్‌మార్, అమృత కళానృత్యం, ఫోక్ మ్యూజిక్, రేలారే రేలా, జానపద డప్పు కళాకారుల వాయిద్యాలు, పగటి వేషాలు, గిరిజన ధింసా న్యత్యం, ఒరియా భాగవత నాటకాలు వంటి వాటిని ఉత్సవ్‌లో ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమాలను ప్రదర్శించే కళాకారులు ఉత్సవాలకు వనే్న తీసుకువస్తున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు, స్థానికుల కేరింతల నడుమ వీటితో అరకు ఉత్సవ్‌కు నూతన శోభ సంతరించుకుంది.

అరకులోయలో పర్యాటకుల పాట్లు
అరకులోయ, డిసెంబర్ 26: ఆంధ్రా ఊటీ అందాల అరకులోయలో గత రెండు రోజులుగా పర్యాటకులు నానా అవస్థలు పడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు తరలివస్తున్న పర్యాటకులకు వసతి సమస్య ఏర్పడడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర, అంతర్రాష్టానికి చెందిన పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో వారంతా విడిది చేసేందుకు లాడ్జింగులు, రిసార్ట్స్, ప్రభుత్వ అతిధి గృహాలు దొరక్క ఇక్కట్ల పాలవుతున్నారు. ప్రకృతి ప్రసాదించిన సుందర దృశ్యాలను వీక్షించడంతో పాటు పర్యాటకాభివృద్ధి సంస్థ, పాడేరు ఐ.టి.డి.ఎ. సంయుక్తంగా నిర్వహిస్తున్న అరకు ఉత్సవ్‌లో పాల్గొనేందుకు పర్యాటకులు భారీగా ఇక్కడకు తరలివస్తున్నారు. అయితే ముందుగా ఇక్కడి ప్రభుత్వ, ప్రయివేటు అతిధిగృహాలను పర్యాటకులు రిజర్వు చేసుకోవడంతో మరికొంత మంది పర్యాటకులకు గదులు లభ్యం కాక పడరాని పాట్లు పడుతున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచర ఉద్యోగులతో కలిసి ఇక్కడికి వచ్చిన పర్యాటకులు తిరిగి వెళ్లలేక స్థానికుల ఇళ్లలను ఆశ్రయిస్తున్నారు. అయినప్పటికీ మరింత మంది వసతి సమస్యతో బాధపడుతూ ప్రభుత్వ కార్యాలయాలను ఆశ్రయించి తలదాచుకుంటున్నారు. నియమ నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ పర్యాటకుల ఇబ్బందులను కళ్లారా చూసి బాధపడుతున్న అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఊహించని దానికంటే గత రెండు రోజులుగా పర్యాటకులు తరలి రావడం వలన ఈ దుస్థితి నెలకొంది.