విశాఖపట్నం

ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి (నెహ్రూచౌక్), మే 2: అధికార దాహంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు ప్రజలకు సాధ్యం కాని హామీలను గుప్పించి గద్దెనెక్కి రెండేళ్లు గడిచినా ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలుచేయకుండా ప్రజలను మోసగించారని ఆరోపిస్తూ సోమవారం అనకాపల్లిలో వైకాపా పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్థానిక ఉడ్‌పేట పార్టీ కార్యాలయం నుండి వైకాపా నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి నెహ్రూచౌక్ జంక్షన్‌లో రోడ్డుపై బెఠాయించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జానకిరామరాజు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తి కావస్తున్నా ఎన్నికల హామీలను నెరవేర్చడంతో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. విశాఖకు రైల్వేజోన్ సాధన కోసం వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్‌నాధ్ చేపట్టిన ఆమరణ నిరహార దీక్షకు ప్రభుత్వం మద్దతు ఇవ్వవల్సి ఉండగా అందుకు వ్యతిరేకంగా రాత్రి సమయాల్లో దీక్షను భగ్నం కలిగించడం అన్యాయమన్నారు. చంద్రబాబుకు నిజంగా రైతుల అభివృద్ధి కోరుకుంటే తక్షణం తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరించి వేలాదిమంది రైతులను, కార్మికులను అదుకోవాలని జానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై వైకాపా పోరాటం సాగిస్తామని మండల అధ్యక్షుడు గొర్లి సూరిబాబు అన్నారు. అనంతరంలో ఆర్డోవో కార్యలయానికి ర్యాలీగా తరలివెళ్లి ఎఓ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా పట్టణ ప్రధాన కార్యదర్శి ఎస్.రమణ అప్పారావు,మండల ప్రధాన కార్యదర్శి బీశెట్టి జగన్, జాజుల రమేష్ పట్టణ మహిళా అధ్యక్షురాలు ఏవి రత్నకుమారి, కుండల రామకృష్ణ, వేడువాక నారాయణరావు పాల్గొన్నారు.
ఖాళీ బిందెలతో ధర్నా
డుంబ్రిగుడ : మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ సోమవారం వైకాపా మండల అధ్యక్షుడు శెట్టి సొర్రు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మండల కేంద్రంలోని మూడు రోడ్ల జంక్షన్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ఖాళీ బిందెలతో ర్యాలీ, ధర్నా చేపట్టారు. హుదూద్ తుపాను కారణంగా సర్వం కోల్పోయి జీవించడానికి అధారం లేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా కరువు మండలంగా ప్రకటించి బాధిత గిరిజనులను ఆదుకోవడమే కాకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ బాబూసుందరానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాపారావు, శ్రీరాములు, వెంకటరావు, జమున, కుజ్జమ్మ, మొగ్నో పాల్గొన్నారు.
హుకుంపేటలో..
హుకుంపేట : మండలంలోని తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ వైకాపా ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. నాలుగురోడ్ల ప్రధాన కూడలివద్ద నుంచి స్థానిక తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్.ఐ.మూర్తికి వినతిపత్రం అందించారు. వైకాపా నాయకులు కంబిడి చిన్నబ్మి, జి.సత్యం మాట్లాడుతూ మండలంలో తాగునీటి సమస్యతో ప్రజలు సతమతం అవుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ సాంబ, చిట్టిబాబు, బాలరాజు పాల్గొన్నారు.
కరవు నిర్లక్ష్యంపై ఆందోళన
నర్సీపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకాన్ని పట్టి పీడిస్తున్న కరవు, మంచినీటి ఎద్దడిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైకాపా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మొండి వైఖరిని విడనాడాలని, ప్రతీ ఇంటింటికి సురక్షితమైన తాగునీటికి అందించాలని, పశుగ్రాసం సరఫరా చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. కార్యాలయం ముందు బైఠాయించారు. నియోజకవర్గం సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తాగునీటికి, గృహ అవసరాలకు నీరు లేని దుస్థితి ఏర్పడిందన్నారు. పశువులకు గ్రాసం లేక పాడి పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుందన్నారు. గ్రామాల్లో పనులు లేక కూలీలు వలసలు పోతున్నారన్నారు. ధన దాహంతో ఉన్న ముఖ్యమంత్రి కరవు పరిస్ధితులను పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు కొనుగోలుపై దృష్టిసారించారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. భవిష్యత్‌లో మరిన్ని ఆందోళనలు చేపట్టేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం మండలాల పార్టీ అధ్యక్షులు అంకంరెడ్డి జమీలు, రాయపురెడ్డి నాగేశ్వరరావు, రుత్తల సత్యనారాయణ, పట్టణ పార్టీ అధ్యక్షుడు కోనేటి రామకృష్ణ, గొలుసు నర్సింహమూర్తి, కె.శ్రీనివాసరావు, బైపురెడ్డి మణమ్మ, ఏకా రాజుబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం తహశీల్దార్ వివిరమణకు పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు.

ఉపాధ్యాయుల భిక్షాటన
అరకులోయ, మే 2: బకాయి ఇంక్రిమెంట్లు, ఏరియర్స్ చెల్లించాలని కోరుతూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్న గిరిజన ఉపాధ్యాయులు సోమవారం భిక్షాటన చేసి నిరసన తెలిపా రు. ఇంక్రిమెంట్లు, ఏరియర్ల కోసం డుంబ్రిగుడ మండలానికి చెందిన 23 మంది గిరిజన ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం ఎదురుగా ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటుచేసి గత నెల 25వ తేదీ నుంచి ఎనిమిది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. బాధిత ఉపాధ్యాయులకు పలు సంఘాలు సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల నాయకు లు వి.మహేశ్వరరావు, కె.రఘునాధ్, పి.హుస్సేన్, విజయ్‌కుమార్, ఆర్.రామకృష్ణ విలేఖరులతో మాట్లాడుతూ తమ సమస్యను పరిష్కారం చేసేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకోవడం లేదు
మాడుగుల, మే 2: తెలుగుదేశం పార్టీలోకి ఏ ఒక్కరినీ ప్రలోభపెట్టి ఆహ్వానించాల్సిన అవసరం తమ పార్టీకి లేదని టిడిపి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్ గవిరెడ్డి రా మానాయుడు స్పష్టం చేశారు. ఇటీవలే శాసనసభ్యుడు బూ డి ముత్యాలనాయుడు టిడిపి తమను పార్టీలోకి ఆహ్వానిస్తుందని, కొంత నగదు, రాజధాని ప్రాంతంలో కొంత భూ మి ఇస్తామని ఎమ్మెల్యే ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా ఖం డించారు. సోమవారం మాడుగుల వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ టిడిపి పరిపాలన చూసి వైకాపా ఎమ్మె ల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారే తప్ప ఎటువంటి ప్రలోభాలు పెట్టలేదన్నారు. ఎవరినుంచి మీకు పార్టీలోకి రావాలని కబురు వచ్చిందో బహిరంగంగా చెప్పాలని సవాల్ విసిరారు. దేశంలో అవినీతి రహిత పాలన ఒక్క టిడిపి ప్రభుత్వమే అందిస్తుందన్నారు. పార్టీ చేస్తున్న సేవలను చూసి ఇతర పా ర్టీలనుంచి తమపార్టీలోకి వచ్చేందుకు మక్కు వ చూపిస్తున్నారని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఓటమి చెందినా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. ఎమ్మెల్యే గా గెలిచిన మీరు ఇంతవరకు ఏ అభివృద్ధి చేశారో చెప్పాల ని ప్రశ్నించారు. కష్టపడి పనిచేసే వ్యక్తులకే పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి అధ్యక్ష కార్యదర్శులు మజ్జి తాతబాబు, వైస్ ఎంపిపి పెరుమాల వెంకటరావు, నందారపు సన్యాసిరావు, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు జూరెడ్డి రాము, జయరాం, లెక్కల కాశిబాబు, కర్రి నా గమణి, ఓండ్రు కృష్ణ, అద్దేపల్లి జగ్గరావు పాల్గొన్నారు.

మావో రవి మృతిపై పోలీసుల దుష్ప్రచారం
* మావోయిస్టుల లేఖ
సీలేరు, మే 2: ఈస్ట్ డివిజన్ మావోయిస్టు పార్టీ నాయకుడు కుడుమల రవి అలియాస్ వెంకట్రావు అనారోగ్యంతో మృతి చెందిన వైనంపై ప్రభుత్వం, పోలీసులు పార్టీపై సాగిస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని ఈస్ట్ డివిజన్ కమిటీ పేరిట స్థానిక విలేఖరులకు ఒక లేఖను పంపించారు. మార్చి చివరి వారంలో అనారోగ్యంతో ఉన్న రవిని కాపాడుకునేందుకు మావోయిస్టు పార్టీ తమకు వీలైనన్ని మార్గాల ద్వారా చివరి క్షణం వరకు ప్రయత్నాలు చేశామని లేఖలో పేర్కొన్నారు.
నిత్యం నిర్బంధం ఉన్న సమయంలో రవికి బయటకు పంపిస్తే ఎదురయ్యే ఇబ్బందులను పార్టీ సిద్ధమై వైద్యసేవల నిమిత్తం విశాఖపట్నం తరలించామన్నారు. మావోయిస్టు పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడంతో ఏప్రిల్ 4వతేదీన రవి తుదిశ్వాస విడిచి అమరుడయ్యాడన్నారు. ప్రజల కోసం, సమాజ మార్పు కోసం ఆఖరి శ్వాస వరకు పోరుమార్గంలో పయనించిన రవి అనారోగ్యంతో మరణించినా ఆయనది వీరమరణమేనని పేర్కొన్నారు. కమ్యూనిస్టు సమాజ స్థాపన లక్ష్యంతో భారత సాయుధ పోరాట ఉద్యమంలో ఇప్పటికీ వేలసంఖ్యలో సాధారణ ప్రజలు మొదలుకుని పార్టీ అత్యున్నత కేంద్రకమిటీ నాయకుల వరకు తమ జీవితాలను ప్రజల కోసమే త్యాగం చేసి చిరస్మరణీయులయ్యారని లేఖలో పేర్కొన్నారు. మరణం ఏ రూపంలో సంభవించినా ప్రజల కోసమే తనువు చాలించడమనేది అమరుల త్యాగాలకు నిదర్శనమని ఈస్ట్ డివిజన్ కమిటీ ఆ లేఖలో తెలిపింది. కుడుమల రవి వలే అనారోగ్యం బారిన పడి అశువులు బాసిన వారిలో అనురాగగాంధీ, కరమ్‌సింగ్ వంటి ఉన్నత నాయకులు ఎందరో ఉన్నారన్నారు. దోపిడీ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న దళారీ ప్రభుత్వాలు రవి అమరత్వాన్ని దౌర్భాగ్యమరణంగా చిత్రీకరించారని ఆరోపించారు. రవి మరణాన్ని అడ్డుపెట్టుకుని ఆదివాసీ గిరిజనుడని వైద్యం అందించలేదని, కొన ఊపిరితో ఉండగా పక్కన పడవేసి చేతులు దులుపుకొన్నారని పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తూ నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మన్యంలో నీటి సంరక్షణకు ప్రాధాన్యత
* ఐటి.డిఎ పిఓ హరినారాయణన్
పాడేరు, మే 2: విశాఖ మన్యంలో రానున్న రెండు నెలలలో కేవలం నీటి సంరక్షణ కోసం నిర్ధేశించిన పనులు చేపట్టాలని ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికా రి ఎం.హరినారాయణన్ ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుం చి ఏజెన్సీలోని అన్ని మండలాల ఎం.పి డి.ఒ.లు, గ్రామీణ నీటి సరఫరా విభా గం ఇంజనీరింగ్ అధికారులు, ప్రత్యేక చిన్ననీటి పారుదల శాఖ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో ఆ యన మాట్లాడుతూ నీటి సంరక్షణ ప నులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత క ల్పిస్తుందన్నారు. ఏజెన్సీలో పంట సంజీవని, ఇంకుడు గుంతలు, సాగునీటి కా లువల మరమ్మతులు, పూడికతీత పనులు చేపట్టాలన్నారు.
మహారాష్టల్రోని లాతూరు జిల్లా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుందని, లాతూరుకు కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి రైళ్ల ద్వారా నీటిని తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆ ప్రాంత ప్రజలకు, అధికారులకు నీటి సంరక్షణపై సరైన అవగాహన లేకపోవడమే దుర్భిక్ష పరిస్థితికి కారణమైందన్నారు. ప్రస్తుతం లాతూరు వాసులు నీటి సంరక్షణ కోసం చేపడుతున్న పను లు దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంద న్నారు. ఏజెన్సీలో భవిష్యత్‌లో నీటి కొరత లేకుండా ఉండాలంటే లాతూరు ప్రాంత వాసులను ఆదర్శంగా చేసుకుని నీటి సంరక్షణ పనులలో చురుగ్గా పాల్గొనాల్సి ఉందని చెప్పారు. ప్రతి మండలంలోనూ పంచాయతీకి కనీసం 20 నీటి కుంటలను పంట సంజీవనిలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని హరినారాయణన్ ఆదేశించారు. అన్ని మం డలాల్లో 16,114 ఇంకుడు గుంతలు త వ్వకాలకు అనుమతి లభించిందని, పంట సంజీవని పథకంలో 4,101, వ్యక్తిగత మరుగుదొడ్లు 26,324 నిర్మాణాలకు అనుమతులు మంజూరైనట్టు తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద ఏజెన్సీలో 3 కోట్ల 64 లక్షల 30 వేల రూపాయల తో 69 మట్టి రోడ్లను నిర్మిస్తారని చెప్పారు. కలెక్టర్ నిర్ధేశించిన పనులకు అంచనాలను తయారుచేయాలని, ప్రతి గ్రామానికి కనీసం రెండు రహదారుల నిర్మాణాలకు ప్రతిపాదనలు సమర్పిస్తే వాటికి కలెక్టర్ నుంచి అనుమతులు తీసుకురానున్నట్టు చెప్పారు. ఏజెన్సీలో 178 చెక్‌డ్యాంల మరమ్మతు పనులకు 14 కోట్ల రూపాయలు మంజూరైనట్టు పిఓ తెలిపారు. ఈ నెల 15వతేది నుంచి చెక్‌డ్యాం మరమ్మతు పనులను ప్రారంభించి రానున్న రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఏజెన్సీలో ప్రతినెల 4వ తేదీ నాటికి పి ంఛన్ల పంపిణీని శతశాతం పూర్తి చే యాలని ఆదేశించారు. రానున్న రెండు నెలల్లో నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత కల్పించి పనులను ప్రారంభించాలని, లేనిపక్షంలో అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రమణ, రాంప్రసాద్, డిఇఇ లు మల్లేశ్వరరావు, సూర్యనారాయణ, ఎ.పి.డి.లు లచ్చన్న, రత్నాకర్, ప్రాజెక్టు ఎఓ చిట్టిబాబు పాల్గొన్నారు.

ఆంత్రాక్స్‌పై భయం వద్దు
* ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు
హుకుంపేట, మే 2: ఆంత్రాక్స్ వ్యాధి నిర్థారణ కాలేనందున ప్రజలు భయపడవద్దని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు స్పష్టం చేశారు. పాతకోట పంచాయతీ పనసపుట్టులో సోమవారం ఆయన పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. గ్రామం మొత్తం కలియతిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంత్రాక్స్‌బాధితుల రక్తనమూనాలు సేకరించిన వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఇంకా వ్యాధి నిర్థారణ కాలేదని తెలిపారు. ఆంతాక్స్ లక్షణాలతో బాధపడుతున్న వారిని విశాఖ కె.జి.హెచ్.కి వెళ్లి పరామర్శించినట్టు తెలిపారు. గ్రామాల్లో ఉన్నవారు ఈ వ్యాధికి భయపడకుండా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి. తమర్భ సత్యమాధవి, జెడ్పీటిసి సాగర వసంతకుమారి, టిడిపి మండల అధ్యక్షుడు కొర్రా తులసీరావు, బి.శ్యాం, పాండురంగస్వామి, ఎం.పి.డి.ఒ. రామచంద్రరరావు పాల్గొన్నారు.