విశాఖపట్నం

ఆర్టీసీ అధికారుల తీరుమారకపోతే సమ్మె తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 18: విశాఖపట్నం రీజియన్‌లో ఆర్టీసీ అధికారుల తీరు మారకపోతే విజయనగరం జోన్ వ్యాప్తంగా సమ్మె తప్పదని ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ గురువారం ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో జీవీఎంసి సమీపానున్న పార్కు వద్ద నిర్వహించిన సామూహిక నిరాహారదీక్షలను సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి ఆయన దామోదరరావు మాట్లాడుతూ పది డిపోల్లో అధికారులు, సూపర్‌వైజర్లలో రూరల్ డివిజనల్‌లో అనకాపల్లి డిపో మేనేజర్,అర్బన్ డివిజన్‌లో పనిచేస్తున్న అధికారులు, సూపర్‌వైజార్లు అంతా పూర్తిగా గుర్తింపు సంఘానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. వీరంతా ఆ సంఘం నాయకుల వద్ద జీతాలు తీసుకున్నట్టుగానే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ యాజమాన్యం వద్ద జీతాలు తీసుకుని పనిచేస్తున్నట్టుగా వ్యవహరించడంలేదన్నారు. కావున వెంటనే విజయనగరణ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, విశాఖ రీజనల్ మేనేజర్ స్పందించి వీరి వైఖరిలో మార్పు వచ్చేలా చూసి రీజియన్‌లో అందరికీ సమాన న్యాయం జరిగేలా చేయాలన్నారు. అలాగే అందుకు బాధ్యులపై కూడా చర్యలు చేపట్టకపోతే మాత్రం విజయనగరం జోన్‌వ్యాప్తడంగకా ఉన్న తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో సమ్మెకు సిద్ధపడాల్సి పరిస్థితి వస్తుందన్నారు. ఏఐటియుసి ఉపాధ్యక్షుడు పడాల రమణ మాట్లడుతూ జిల్లాలో ఆర్టీసీ అదికారులు ఎన్‌ఎంయుకు అనుకూలంగా వ్యవహరించే విధానాలు మానకపోతే సీపీఐ, ఏఐటియుసి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఆర్‌ఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. విశాఖ అర్బన్‌లో పనిచేస్తున్న అధికారులు సూపర్‌వైజర్లు పూర్తిగా అదికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగిందన్నారు. ఈ నెలాఖరిలోపు వివక్షతపై పూర్తి ఆధారాలతో సంస్థ సిఎండికి ఫిర్యాదు చేయడమే కాకుండా ఇందుకు చెందిన బాధ్యులపై చర్యలు చేపట్టే వరకు పోరాటం చేస్తామన్నారు. ఇయు రాష్ట్ర సహాయ కార్యిదర్శి నందమూరి వెంకట రామారావు, విజయనగరం జోన్ ఆర్టీసీ ఇయు జోనల్ అధ్యక్షుడు చింతాడ వెంకట్రావు, జోనల్ కార్యదర్శి భానుమూర్తి, రీజనల్ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ, అల్లు సురేష్‌నాయుడు, వి.ప్రసాదరావు, కెజె ప్రభాకర్, కెయస్ రావు, తదితరులు పాల్గొన్నారు.