విశాఖపట్నం

సమస్యల పరిష్కారం కోరుతూ ఎన్‌ఎంయు ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 18: ఆర్టీసీ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ ఎన్‌ఎంయు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం విశాఖ నగరంలో పలు డిపోల వద్ద కార్మికులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. భోజన విరామ సమయంలో నిర్వహించిన ధర్నాలో కార్మికులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. సంఘ కార్యదర్శి ఆడారి కనక శివాజీ మాట్లాడుతూ గత ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీన రావాల్సిన పేస్కేలు వెంటనే అమలుచేయాలని, పనిష్మెంట్, సర్వీసు నిబంధనలను మార్పులు చేయాలని, 2013 సంవత్సరం పే ఏరియర్స్ బాండ్లు రద్దచేసి పైకం ఇవ్వాలని ఎనిమిది రోజులు సమ్మె కాలానికి జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే సంస్థ ఆస్తులను పరిరక్షించాలని, చట్ట వ్యతిరేకంగా వైద్యం నిమిత్తం వసూలు చేస్తున్న రూ.100లు ఆపాలని 60 రోజులు సమైక్యాంధ్ర సమ్మె ప్రత్యేక సెలవుగా అమలు చేయాలన్నారు. మహిళా సమస్యలు పరిష్కరించాలని, మిగిలిన కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, చనిపోయిన కార్మికుల పిల్లలను వెంటనే ఉద్యోగాలు కల్పించాలని, పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనాలని, డివిజనల్ సీనియారిటీలో వ్యత్యాసాలను సరిచేసి పదోన్నతులు కల్పించాలన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో డిపో అధ్యక్షుడు పి.గణపతి, సంయుక్త కార్యదరిశ డి.సీతారామరాజు పాల్గొన్నారు.
* పలు డిపోల వద్ద ధర్నాలు
ఆర్టీసీ ఎన్‌ఎంయు ఆధ్వర్యంలో పలు డిపోల వద్ద భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేస్తూ కార్మికులు నిరసన తెలియజేశారు. 20డిమాండ్లకు పైగా ఏళ్ళ తరబడి పరిష్కారానికి నోచుకోలేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి పిఎన్ మూర్తి, అధ్యక్షుడు కెఎస్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.