విశాఖపట్నం

ఆకాశాన్నంటిన విమాన టిక్కెట్ ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 18: పండగ రోజుల్లో విమానయాన సంస్థలు, ప్రైవేటు బస్సు యాజమాన్యాలు బాగానే దండుకుంటున్నాయి. పండుగలకు స్వగ్రామాలకు రావడం ఎంత కష్టమయిందో, తిరిగి ఆయా గమ్య స్థానాలు చేరుకోవడం కూడా అంతే కష్టంగా ఉంది. బస్సులు, రైళ్లు ఫుల్ అయిపోయాయి. బస్సుల్లోనైనా, రైళ్లలోనైనా నిలబడైనా ప్రయాణిద్దామంటే, ఆ అవకాశం కూడా లేదు. ముఖ్యంగా హైదరాబాద్‌కు బస్సులు, రైళ్ల కొరత తీవ్రంగా ఉంది. ఏ దారీ దొరకక, కాస్త ఎక్కువ ధరైనా, విమానాల్లో వెళ్లిపోదామనుకుంటే, విమాన టిక్కెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. శుక్రవారం విశాఖ నుంచి హైదరాబాద్‌కు కనీస ధర 11 వేల నుంచి గరిష్ఠ ధర 22 వేల రూపాయల వరకూ ఉంది. ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్ ధరలు సుమారు 30 వేల రూపాయల వరకూ పలుకుతోంది. ఈ విమానాల ధరలు 14, 15 తేదీల్లో 43 వేల రూపాయల వరకూ పలికింది. సాధారణ రోజుల్లో విశాఖ నుంచి హైదరాబాద్‌కు 3000 నుంచి గరిష్ఠంగా ఆరు వేల రూపాయలు ఉండేది. అది ఇప్పుడు 22 నుంచి 30 వేలకు చేరుకుందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉండగా విశాఖ నుంచి బెంగళూరుకు నేరుగా వెళ్లే విమాన సర్వీసులు తక్కువగా ఉన్నాయి. నేరుగా వెళ్లే విమానాల టిక్కెట్ ధరలు 30 వేల వరకూ పలుకుతోంది. గరిష్ఠంగా 41 వేల రూపాయల ధర పలుకుతోంది. దీంతో విధిలేని పరిస్థితుల్లో విమానాలు ఎక్కాల్సి వస్తోంది.