విశాఖ

రాయితీ నగదు ఇవ్వాలని పోలీసులకు ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాకవరపాలెం, జనవరి 19: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన రాయితీ నగదును ఇప్పించాలని లబ్ధిదారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని పీపీ అగ్రహారం గ్రామానికి చెందిన కడారి బుజ్జి, మట్ల నాగచంద్ర 2017లో ఏడీబీ నర్సీపట్నంలో బ్రాంచ్‌లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికీ లక్షా ఇరవైవేల రూపాయల రుణం మంజూరైంది. ఈ రుణంలో ఎస్సీ కార్పొరేషన్ 72వేలు రాయితీగాను, 48వేలు బ్యాంకు లింగేజీ రుణంగాను లబ్ధిదారులకు మంజూరైంది. ఈరుణంలో 48,150లు ఒక్కొక్క లబ్ధిదారునికి విశాఖ డెయిరీ డైరెక్టర్ శీరంరెడ్డి సూర్యనారాయణ ఇచ్చారు. మిగిలిన రాయితీ నగదు 23,850లు తమకు ఇవ్వాలని లబ్ధిదారులు సూర్యనారాయణను అడిగారు. ఈ డబ్బులు మీకు రావని, ఖర్చులుగా తమ వద్ద ఉంచుకుంటామని ఆయన బదులిచ్చినట్టు బాధితులు తెలిపారు. పేదవారమైన తాము ఏం చేయగలమని వాపోయారు. దీనిపై తమకు న్యాయం చేయాలని శుక్రవారం బాధితులు పోలీసులకు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.

సమస్యలపై అధికారులను నిలదీసిన వైకాపా నేత
మాకవరపాలెం, జనవరి 19: గ్రామంలో సమస్యలు పరిష్కరించలేదని వైకాపా నాయకుడు గొంతిన హరిబాబు అధికారులను నిలదీశారు. మండలంలోని తామరం గ్రామంలో గురువారం రాత్రి అధికారులు పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలో రాచపల్లి సమీపంలో ఉన్న గెడ్డాపొరంబోకు భూమిలో ఎన్టీఅర్ పక్కా గృహాలకు ఎల్‌పీసీలు ఎలా మంజూరు చేశారని నిలదీశారు.గ్రామంలో బినామి పేర్లతో మరుగుదొడ్లు మంజూరు చేసి నిర్మాణం చేయకుండానే బిల్లులు టీడీపీ నాయకులు కాజేసి లబ్ధిదారులను మోసం చేశారని ఆరోపించారు. కింద తామరంలో ఏడాది కాలంగా ఇళ్ల మద్యలో విద్యుత్ వైర్లు వేళాడుతున్నాయని, ఈవిషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. సమస్యలు పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో ఉదయశ్రీ తెలిపారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ చల్లా రత్నం, ఈవో ఆర్డీ సత్యనారాయణ, డీటీ ప్రసాదరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.