విశాఖ

టెట్ పరీక్షకు కోచింగ్ ఇప్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, జనవరి 19: ఉపాధ్యాయ వృత్తిన్ని చేపట్టి ఉపాధి పొందాలన్న ఉద్ధేశ్యంతో ఉన్న గిరిజన నిరుద్యోగ యువతకు టెట్ పరీక్షలకు సిద్ధం చేయాలని పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారిని పలువురు కోరుతున్నారు. ఉన్నత విద్యను అభ్యసించి ఇళ్లలో ఖాళీగా ఉంటున్న తమ నిరుద్యోగ పిల్లలందరినీ టెట్ పరీక్షలకు సంబంధించి కోచింగ్ ఇప్పించాలని తల్లిదండ్రులు కోరారు. టెట్ పరీక్షకు అర్హత సాధించేవిధంగా సిద్ధవౌతున్న నిరుద్యోగులు ఐ.టి.డి.ఎ. ఆధ్వర్యంలో తమకు శిక్షణ ఇస్తారన్న ఆశతో ఎదురు చూస్తున్నారని వారు అన్నారు. టెట్ పరీక్షలకు వెళ్లే నిరుద్యోగులను కాదని, గతంలో టెట్‌లో ఉత్తీర్ణులై గిరిజన యువతకు మాత్రమే డి.ఎస్.సి. కోసం కోచింగ్ ఇవ్వాలని అధికారులు భావిస్తుండడం సమంజసం కాదని వారు చెప్పారు. టెట్ పరీక్షలో ఉత్తీర్ణులై వారికి కోచింగ్ ఇప్పిస్తే ఈ సంవత్సరం ఈ పరీక్ష రాసేందుకు సిద్ధవౌతున్న నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశం ఉందని వారు వాపోతున్నారు. దీనిని అధికారులు పరిగణలోకి తీసుకుని టెట్ పరీక్షకు సిద్ధమైన అభ్యర్థులకు కూడా ప్రత్యేక కోచింగ్ ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.