విశాఖ

గిట్టుబాటు ధర కల్పించాలని ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జనవరి 19: గిరిజన రైతులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించి, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో పాడేరు ఐ.టి.డి.ఎ. కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జిల్లా అధ్యక్షుడు ఆర్.శంకరరావు మాట్లాడుతూ 1982వ సంవత్సరం జనవరి 19న దేశ వ్యాప్తంగా జరిగిన రైతు, కార్మికుల ఆందోళన కార్యక్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో పది మంది రైతులు మృతి చెందారని చెప్పారు. దీంతో అప్పటి నుంచి జనవరి 19న కార్మిక, కర్షక మైత్రి దినంగా పాటిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో బి.జె.పి. అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల కాలంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని ఆయన అన్నారు. పరిశ్రమల పేరిట రైతుల భూములను సేకరిస్తున్న ప్రభుత్వం వారిని రోడ్డున పడేస్తూ తీవ్ర అన్యాయం చేస్తుందని ఆయన చెప్పారు. రేషన్ డిపోలను షాపింగ్ కాంప్లెక్స్‌లకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన అన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిరంకుశ విధానాల వలన రైతులు, కర్షకులకు రక్షణ లేకుండా పోయిందని ఆయన వాపోయారు. ప్రభుత్వాలు సాగిస్తున్న ఇటువంటి దుర్మార్గపు విధానాల నుంచి తమను తాము కాపాడుకునేందుకు రైతులు, కార్మికులు ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతు ఆత్మహత్యలను నివారించాలని, రుణ మాఫీని అమలు చేయాలని, ఉపాధి హామీ పథకం కింద ప్రతి కుటుంభానికి సంవత్సరానికి రెండు వందల రోజుల పనిదినాలు కల్పించాలని, కార్మికులకు కనీస వేతనంగా నెలకు 18 వేల రూపాయలు చెల్లించాలని, స్వామినాధన్ కమిటి సిఫార్సులను అమలు చేయాలని శంకరరావు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు ఎల్.సుందరరావు, వై.మంగమ్మ, కె.కాంతమ్మ, సూరిబాబు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

ఏజెన్సీలో సదరం శిబిరాలు
పాడేరు, జనవరి 19: విశాఖ ఏజెన్సీలో ఈ నెల 23 నుంచి 27వ తేది వరకు దివ్వాంగుల సదరం అసెస్మెంట్ శిబిరాలను నిర్వహిస్తున్నట్టు పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి పి.రవిసుభాష్ శుక్రవారం విలేఖరులకు తెలిపారు. ఈ నెల 23న చింతపల్లిలో వెలుగు కార్యాలయంలో, 25న పాడేరులో 27న అరకులోయలో ఈ శిబిరాలను ఏర్పాటు చేసామని ఆయన చెప్పారు. చింతపల్లిలో నిర్వహించే సదరం శిబిరానికి గూడెంకొత్తవీధి, కొయ్యూరు, చింతపల్లి మండలాలకు చెందిన దివ్వాంగులు, పాడేరులో నిర్వహించే శిబిరానికి జి.మాడుగుల, పెదబయలు, పాడేరు, ముంచంగిపుట్టు మండలాలకు చెందిన వారు, అరకులోయలో నిర్వహించే శిబిరానికి హుకుంపేట, అనంతగిరి, డుంబ్రిగుడ, అరకులోయ మండలాల దివ్వాంగులు తమ ఆధార్, రేషన్ కార్డులతో పాటు దివ్వాంగుల దృవీకరణ పత్రాలతో హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని దివ్వాంగులతో వినియోగించుకోవాలని, మిగిలిన వివరాల కోసం వెలుగు కార్యాలయాలను సంప్రదించాలని ఆయన కోరారు.