విశాఖపట్నం

జన్మభూమి-మావూరుకు అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 19: ఇటీవల పూర్తయిన ఐదవ విడత జన్మభూమి-మావూరు కార్యక్రమంలో విశాఖ జిల్లా రాష్ట్ర స్థాయిలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. విజయవాడలో రెండు రోజులుగా జరుగుతున్న కలెక్టర్ల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవార్డులను ప్రకటించారు. జన్మభూమి-మావూరు కార్యక్రమం విజయవంతం చేసి రెండో స్థానంలో నిలిచినందుకు గాను జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అలాగే ప్రజల నుంచి వచ్చే వినతుల పరిష్కారం (ఆర్థిక, ఆర్థికేతర) అంశంలో కూడా జిల్లా రెండోస్థానంలో నిలిచింది. మొత్తంగా విశాఖ జిల్లా మూడు అవార్డులను దక్కించుకుంది. ఇక జిల్లాలో మండల స్థాయిలో ఎస్ రాయవరం మండలం, మున్సిపాలిటీల్లో భీమునిపట్నం, గ్రామాల విభాగంలో నర్సీపట్నం మండలం ధర్మసాగరం పంచాయతీలకు జిల్లా స్థాయి అవార్డులు దక్కాయి. విశాఖ అర్బన్ పరిధిలో ఉత్తమ వార్డుగా 72వ వార్డుకు, ఉత్తమ స్వయం సహాయకం సంఘాల విభాగం (రూరల్)లో పద్మనాభం మండలం రెడ్డిపల్లికి చెందిన శ్రీసూర్య స్వయం సహాయక సంఘం, నగర పరిధిలో జీవీఎంసీ పరిధిలోని లాలాజీ స్వయం సహాయక సంఘం, సెర్ఫ్ సాధికార మిత్రగా నర్సీపట్నం మండలం ధర్మసాగరం గ్రామం, కళారూపాల ప్రదర్శనలో భీమునిపట్నం, ఇన్నోవేటివ్ గ్రామీణ క్రీడా విధానం అమల్లో డీఎస్‌డీఓ జూన్ గాలియట్‌లు అవార్డులు అందుకున్నారు.