విశాఖపట్నం

గీతం ఛాన్స్‌లర్‌కు జాతీయ ఫెలోషిప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 19: గీతం డీమ్డ్ యూనివర్శిటీ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణారావుకు న్యూఢిల్లీలోని జాతీయ తాత్విక పరిశోధన మండలి (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫలిసాఫికల్ రీసెర్చ్) జాతీయ ఫెలోషిప్‌ను ప్రకటించింది. ప్రతిష్ఠాత్మకమైన ఈ సత్కారం అందుకున్న రామకృష్ణారావు ‘ద భగవద్గీత : ఎసైకాలాజికల్ ప్రొఫెల్’ అంశంపై వచ్చే రెండేళ్లలో అధ్యయనం చేస్తారు. ప్రొఫెసర్ రామకృష్ణారావు ప్రపంచ ప్రసిద్ధ మనస్తత్వవేత్త, తత్వవేత్త, విద్యావేత్త, నాయకుడు, దార్శనికుడు. ప్రస్తుతం ఆయన గీతం డీమ్డ్ వర్శిటీ ఛాన్స్‌లర్‌గా, గీతం స్కూల్ ఆఫ్ గాంధీయన్ స్టడీస్ చైర్మన్‌గా సేవలందిస్తున్నారు. మనస్సుకు సంబంధించిన, భారతీయ మనస్తత్వం, భారతీయ వేదాంతాల్లో అగ్రగాముల్లో ఒకరిగా గుర్తింపు పొందుతున్నారు. ఇంతకు ముందు ప్రొఫెసర్ రామకృష్ణారావు, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్‌గా, అమెరికాలో మానవ ప్రవృత్తిని పరిశోధించే సంస్థ వ్యవస్థాపకుడిగా, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా, ఐసీపీఆర్ చైర్మన్‌గా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా సలహాదారుగా సేవలందించారు. ఇప్పటి వరకూ ఆయన దాదాపు 300 పరిశోధన పత్రాలు ప్రచురించారు. తన 85వ ఏట ఇనుమడించిన ఉత్సాహంతో పాండిత్యం, తాత్విక చతురత, లోతైన ఆలోచనలు, శ్రేష్ఠమైన నాయకత్వంతో విద్య, సామాజిక పురోభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారు. గాంధీజీ ఆలోచనలు, యోగా, మనస్తత్వం, భారతీయ సంస్కృతి-గుర్తింపులతో పాటు పలు ఇతర అంశాలపై గతేడాది ఐదు పుస్తకాలను ప్రచురించారు.