విశాఖపట్నం

తక్కువ వచ్చింది ఏం చేయమంటారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 26: ఎంతో ఆర్భాటంగా ఇస్తున్న చంద్రన్న క్రిస్మస్ కానుకల సరఫరాలో డొల్లతనం సాక్షాత్తు మంత్రి గంటా శ్రీనివాసరావు కళ్ల ముందు సాక్షాత్కరించింది. క్రిస్మస్ కానుకగా నిత్యావసర వస్తువులను ఉచితంగా అందజేస్తున్న ప్రభుత్వం వాటి సరఫరా తీరుపై పెద్దగా దృష్టి సారించలేదు. అయితే జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు చంద్రన్న క్రిస్మస్ కానుక సరఫరాపై వస్తున్న ఫిర్యాదులపై స్పందించారు. నగరంలోని కప్పరాడ, పెదగంట్యాడ తదితర ప్రాంతాల్లోని చౌకధరల దుకాణాలను శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీలర్లు పాల్పడుతున్న అక్రమాలను చూసి నివ్వెర పోయారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ డీలర్లు వ్యవహరిస్తున్న తీరు ఆయన కంటపడగా, నిలదీసిన మంత్రికి అనుకోని అనుభవం ఎదురైంది. ముందుగా మంత్రి గంటా బర్మాకేంపు సమీపంలోని 51వ నెంబర్ రేషన్ దుకాణాన్ని సందర్శించారు. మంత్రి వెళ్లే సరికి దుకాణం మూసి ఉంది. చంద్రన్న క్రిస్మస్ కానుక పంపిణీని సకాలంలో పూర్తి చేసేందుకు ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల వరకూ చౌక ధరల దుకాణాన్ని తెరచి ఉంచాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది. అయితే నగరంలోని ఈ దుకాణం సాయంత్రం ఐదు గంటలకే మూసి ఉండటంతో మంత్రి కంగుతిన్నారు. పక్కనే ఉన్న సంయుక్త కలెక్టర్‌ను వివరణ కోరారు. తక్షణమే డీలరును సస్పెండ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి గంటా ఆదేశించారు. అనంతరం మంత్రి పెదగంట్యాడలోని 348 రేషన్ దుకాణాన్ని తనిఖీ చేశారు. అప్పటికే డీలర్లందరికీ సమాచారం అందడంతో దుకాణాలను అర్జంటుగా తెరిచిచారు. అయితే మంత్రి సందర్శించిన దుకాణంలో సరుకుల పంపిణీ సక్రమంగా జరుగుతోందని భావిస్తున్న తరుణంలో సరుకల తూకంపై ఫిర్యాదు అందడంతో విచారించారు. ఈ దుకాణంలో ఇస్తున్న సరుకులు తూకం తక్కువగా ఉన్నట్టు మంత్రి గుర్తించారు. ఇదే విషయంపై డీలర్‌ను ప్రశ్నించగా, వచ్చిన సమాధానంతో మంత్రి గంటా కంగుతిన్నారు. స్టాక్ పాయింట్ల నుంచి వస్తున్న సరుకులు తూకం తక్కువగా ఉంటోందని, వచ్చిన సరుకును అంతే మొత్తాన్ని కార్డు దారుల నుంచి తగ్గిస్తున్నట్టు డీలర్ సమాధానం ఇచ్చాడు. దీంతో మంత్రి అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు పండుగ సందర్భంగా ఇస్తున్న సరుకుల సరఫరాలో పారదర్శకత లోపించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మీదట ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జెసి నివాస్‌ను ఆదేశించారు. కొన్ని రేషన్ దుకాణాల్లో ఇ పాస్ విధానం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నట్టు డీలర్లు తన దృష్టికి తీసుకువచ్చారని, స్థానిక విఆర్‌ఓల సహకారంతో బయోమెట్రిక్, ఐరిష్ సమస్యలున్నా సరుకుల పంపిణీని నిలవద్దని సూచించారు. పర్యటనలో ఆయన వెంట ఎమ్మెల్యేలు పి విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాస్, జెసి నివాస్, పౌరసరఫరాల అధికారులు పాల్గొన్నారు.