విశాఖ

సిట్ బృందానికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం శూన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావికమతం,జనవరి 20: మండలంలో గుడ్డిబంద గ్రామంలో చోటుచేసుకున్న భూ కుంభ కోణానికి సంబంధించి సిట్ బృందానికి ఫిర్యాదు చేసినా ఆక్రమణదారుల ఆగడాలు కొనసాగుతున్నాయని సీపీ ఎమ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు నిరసన వ్యక్తం చేశారు. శనివారం పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ గ్రామంలో వివిధ సర్వే నెంబర్లలో ఉన్న డి ఫారమ్ భూములను ఆక్రమించుకోవడంతో పాటు జిరాయితీ భూములుగా రికార్డులు సైతం ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారని, ఆధారాలతో సిట్ బృందానికి ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆక్రమణదారుడు కోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఈ భూముల్లో గిరిజనులు సాగుచేస్తున్న ఫలసాయాన్ని స్వాధీనం చేసుకునేందుకు అధికారుల సాయం కోరుతున్నారన్నారు. తక్షణం రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం జోక్యం కల్పించుకొని ఈ భూముల్లో సాగులో ఉన్న ఫలపాయంను గిరిజనులకు చెందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో గిరిజన రైతులు పాల్గొన్నారు.