విశాఖ

అర్హులందరూ చంద్రన్న బీమా పథకంలో చేరాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల, జనవరి 20: అర్హులైనవారందరూ చంద్రన్న బీమా పథకంలో చేరాలని వెలుగు ఏపీ ఎమ్ కరుణానిది కోరారు. శనివారం స్థానిక స్ర్తి శక్తి భవనంలో చంద్రన్న బీమా పథకం కింద ఎనిమిది కుటుంబాలకు 12.50 లక్షల రూపాయలు పరిహారానికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను సంర్పంచ్ గవ్వా గోవిందరావు, జన్మభూమి కమిటీ సభ్యుడు పినపాత్రుని బాబ్జీ, పీవీ సూర్యారావులు అందజేశారు. ఈసందర్భంగా ఏపీ ఎమ్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఈ పథకాన్ని ముఖ్యమంత్రి మన రాష్ట్రంలోనే అమలు చేస్తున్నారన్నారు. కుటుంబ యజమాని చనిపోతే కుటుంబాన్ని చంద్రన్న బీమా ఆదుకుంటుందన్నారు. సర్పంచ్ గోవిందరావు మాట్లాడుతూ ఈ పథకంపై ప్రజల్లో అవగాహన కల్గించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరుగుదొడ్లు లేని ఇళ్లకు కరెంట్ కట్
కోటవురట్ల, జనవరి 20: మరుగుదొడ్లు నిర్మాణాలను మార్చి 31 తేదీలోగా పూర్తి చేసుకోలేని ఇళ్లకు విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తామని మండల ప్రత్యేక అధికారి వి.శ్రీ్ధర్ హెచ్చరించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో శనివారం ఓ డీ ఎఫ్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 31నాటికి మండలాన్ని ఓడీ ఎఫ్‌గా ప్రకటించాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. దీనికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. మరుగుదొడ్లు లేని కుటుంబాలు ముందుకు వస్తే 15వేల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే రేషన్ సరఫరా కూడా నిలిపి వేస్తామని స్సష్టం చేశారు. గ్రామ స్థాయి అధికారులు మరుగుదొడ్లు నిర్మాణంలో అలక్ష్యం వహిస్తే వేతనాలను నిలిపి వేస్తామని హెచ్చరించారు. అధికారులు గ్రామాలకు వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో కళ్యాణి, తహసీల్దార్ శ్రీనివాస్, ఈవోఆర్డీ ప్రభాకరావు తదితరులు పాల్గొన్నారు.

ఛలో అమరావతి విజయవంతం చేయాలి
రావికమతం, జనవరి 20: ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కీలకమైన నిత్యవసర సరుకుల పంపిణీ పథకం అమలు చేస్తున్న డీలర్లపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సంఘం జిల్లా అధ్యక్షుడు పి.చిట్టిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన బుచ్చయ్యపేట, రోలుగుంట, రావికమతం మండలాల రేషన్ డీలర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రోజు రోజుకూ పెరిగిపోతున్న ధరలతో ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న కమిషన్ మొత్తం డీలర్ల కుటుంబ పోషణ భారంగా మారుతున్న నేపథ్యంలో రేషన్ సరుకులు కుదించడం వలన కమిషన్ తగ్గి డీలర్ల పరిస్థితి మరింత దిగజారిందని ఆవేధన వ్యక్తం చేశారు. అయినప్పటికీ డీపో నిర్వహణపై ఆధారపడ్డ వేలాది కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనివ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ దృష్యా పోరాటాల ద్వారానే డిమాండ్లు సాధించుకోవాలన్న నిర్ణయం మేరకు ఫిబ్రవరి 18న అమరావతిలో భారీ ధర్నా కార్యక్రమం తలపెట్టామన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని డీలర్లందరూ తప్పక హాజరు కావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఇ-పోస్ విధానం ద్వారా పంపిణీ చేస్తున్న కార్డు ఒక్కింటికి 15రూపాయలు యూజర్ చార్జీలు చెల్లించాలని, అన్ని గ్రామాల్లో చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు చేయాలని, పంపిణీ చేసే ప్రతీ సరుకు విలువకు పది శాతం కమిషన్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఎమ్ ప్రసాద్, ఏ ఎస్ కరుణాకర్, పి.నూకాలతల్లి డీలర్లు పాల్గొన్నారు.