విశాఖ

మానవీయ విలువల పెంపుదలకే అమ్మకు వందనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జనవరి 22: సమాజంలో మానవీయ విలువలను పెంపొందించి చిన్నారులలో భక్తి భావాన్ని కల్పించేందుకే తమ ప్రభుత్వం అమ్మకు వందనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి అన్నారు. పాడేరులోని వివిధ పాఠశాలల్లో సోమవారం అమ్మకు వందనం కార్యక్రమాన్ని అట్టహసంగా నిర్వహించారు. బాలల తల్లిదండ్రులను పాఠశాలలకు ఆహ్వానించి తమ పిల్లలచే వారికి వందనం ఇప్పించారు. తమ పిల్లలు చక్కగా చదువుకుని ప్రయోజకులు కావాలని ఆకాంక్షిస్తూ తల్లిదండ్రులు వారిని దీవించారు. ఈ సందర్భంగా స్థానిక మోదమాంబ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అమ్మకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న ఎం.ఎల్.ఎ. మాట్లాడుతూ విద్యార్థులలో చిన్నతనం నుంచి మంచి లక్షణాలను అలవరచి మానవత్వాన్ని ప్రబోదించేందుకు అమ్మకు వందనం కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. ప్రతి విద్యార్థికి గురువు కంటే తల్లి ప్రధమమని, తల్లిని గౌరవించిన వారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ఆమె చెప్పారు. విద్యార్థులకు చదువుచెప్పే గరువు కంటే నవ మాసాలు మోసి కన్న తల్లి ఎంతో గొప్పదని, దీనిని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని ఆమె ఉద్భోధించారు. విద్యార్థులు తల్లిదండ్రులను ప్రేమిస్తూ వారి అడుగుజాడల్లో నిలవాలని ఆమె సూచించారు. ప్రస్తుత సమాజంలో అంతరించిపోతున్న మానవీయ విలువలను పెంపొదించాలన్న లక్ష్యంతోనే తమ ప్రభుత్వం అమ్మకు వందనం అనే అద్భుత కార్యక్రమానికి రూపకల్పన చేసినట్టు ఆమె పేర్కొన్నారు. ఏజెన్సీలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని విధిగా అమలు చేయాలని ఈశ్వరి కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

వచ్చే నెల 10న పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభలు
పాడేరు, జనవరి 22: నెల్లూరులోని శేషారెడ్డి విజాన కేంద్రంలో వచ్చే నెల 10,11 తేదీలలో తమ సంఘం 18వ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్టు పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు టి.శ్రీరామమూర్తి, కార్యదర్శ జె.సూర్యనారాయణ తెలిపారు. సోమవారం వారు విలేఖరులతో మాట్లాడుతూ 1973వ సంవత్సరంలో ఏర్పడిన తమ సంఘం నాలుగు దశాబ్ధాలకు పైగా ప్రజల హక్కుల పరిరక్షణకు ఆవిరాళ కృషి చేస్తుందని అన్నారు. బడుగు, బలహీన వర్గాల వారిపై జరిగిన ఎన్నో దాడులలో తమ సంఘం వారికి అండగా నిలబడి పౌరుల హక్కుల పరిరక్షణకు పాటుపడుతూ వస్తోందని వారు చెప్పారు. ప్రభుత్వం సాగించే బూటకపు ఎన్‌కౌంటర్‌లను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలవడంలో తమ సంఘం ముందుంటుందని వారు అన్నారు. నాలుగు దశాబ్ధాల సుదీర్ఘ చరిత్రలో తమ సంఘం సాధించిన విజయాలు, సాధించాల్సిన అంశాలు వంటి వాటిని రాష్ట్ర మహాసభలలో సుదీర్ఘంగా చర్చించనున్నట్టు వారు పేర్కొన్నారు. తమ సంఘం రాష్ట్ర మహాసభలకు అన్ని వర్గాల వారు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.