విశాఖ

ఘనంగా అక్షరాభ్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జనవరి 22: వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని పాడేరు పట్టణంలోని వివిధ పాఠశాలల్లో సోమవారం భారీగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక మోదమాంబ ఉన్నత పాఠశాల, అక్షర పాఠశాలల్లో వేద మంత్రోచ్చరణల నడుమ నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం వేడుకగా సాగింది. సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమ నిర్వహణకు ఈ రెండు పాఠశాలలు భారీ ఏర్పాట్లు చేసి పోటాపోటీగా నిర్వహించాయి. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు ఈ రెండు పాఠశాలల్లో తమ పిల్లలకు అక్షరాభ్యాసాన్ని చేసారు. మోదమాంబ పాఠశాలలో వసంత పంచమిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం నుంచి ప్రత్యేక హోమాలను నిర్వహించి సోమవారం ఉదయం అక్షరాభ్యాసాన్ని చేపట్టారు. అక్షర ఉన్నత పాఠశాలలో దాదాపు 250 మంది చిన్నారులకు, మోదమాంబ పాఠశాలలో సుమారు మూడు వందల మందికి అక్షరాభ్యాసాన్ని చేసాయి. ఈ కార్యక్రమానికి పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి ముఖ్య అతిధిగా హాజరు కాగా జెడ్పీటీసీ పోలుపర్తి నూకరత్నం, ఎం.పి.పి. వర్తన ముత్యాలమ్మ, సర్పంచ్ కిల్లు వెంకటరత్నం, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయకుమార్, మండల విద్యాశాఖ అధికారి సరస్వతితో పాటు పలువురు అధికారులు, మోదమాంబ పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ జి.వి.మూర్తి, అక్షర పాఠశాల ప్రిన్సిపాల్ రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.