విశాఖపట్నం

మార్కెట్‌లోకి ఆడి క్యూ 5 కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 22: విలాసవంతమైన కార్లను వినియోగించే వారికోసం ఆడి సంస్థ ఆడి క్యూ 5 రెండో తరం కారును విశాఖ మార్కెట్‌లోకి సోమవారం ప్రవేశపెట్టింది. ఆడి విశాఖపట్నం విభాగం సీఈవో జెరోమ్ ఎడ్వర్డ్ క్యూ 5 సిరీస్ కారును లాంఛనంగా ప్రారంభించారు. క్యూ 5 సెకెండ్ జనరేషన్ కారు ప్రారంభ ధర రూ.53.25 లక్షలు (ఎక్స్‌షో రూం ధర). పాత మోడల్‌తో పోలిస్తే 90కిలోల బరువును తగ్గి, భద్రత ప్రమాణాలు మెరుగుపరచుకుందన్నారు. ఇంథన సామర్థ్యాన్ని 20 శాతం మెరుగుపరచుకుందన్నారు. గంటకు 218 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కారు 7.9 సెకన్ల వ్యవధిలో 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందన్నారు. గత సంవత్సరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 510 యూనిట్లు విక్రయించామని, వీటిలో హైదరాబాద్ 414 కార్లు, విశాఖలో 96 కార్లున్నాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి రేటు సాధిస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.