విశాఖపట్నం

ఏసీసీఏలో గీతం విద్యార్థుల ఘనత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 22: ప్రపంచ వ్యాప్తంగా 118 దేశాల్లో గుర్తింపు కలిగిన అసోసియేషన్ ఆఫ్ చార్టడ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ (ఏసీసీఏ) నిర్వహించిన పరీక్షలో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం మేనేజ్‌మెంట్ విభాగం విద్యార్థులు అరుదైన ఘనత సాధించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ద్వారా బీకాం (ఆనర్స్) కోర్సు అభ్యసిస్తున్న నేమాని రేవంత్ ఏసీసీఏ నిర్వహించిన అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించి అంతర్జాతీయ సభ్యునిగా అర్హత సాధించారు. రేవంత్‌తో పాటు మరో 45 మంది విద్యార్థులు 55 వరకూ ఏసీసీఏ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పీ.షీలా తెలిపారు. కఠినతరమైన ఏసీసీఏ సబ్జెక్టుల్లో కార్పొరేట్ రిపోర్టింగ్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, బిజినెస్ అనాలసిస్, అడ్వాన్స్డ్ పెర్‌ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్, ఆడిట్ అండ్ అస్యూరెన్స్‌లో గీతం విద్యార్థులు ప్రతిభ కనబరిచారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీకాం (ఆనర్స్)తో కలిపి ఏసీసీఏ శిక్షణకు ఇస్తున్న ఏకైక విద్యా సంస్థగా గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ గుర్తింపు పొందిందన్నారు. బీకాం ద్వితీయ, తృతీయ సంవత్సరం కోర్సులు అభ్యసించే తరుణంలోనే విద్యార్థులు ఏసీసీఏ కోర్సుల్లో మంచి ఫలితాలు సాధించడం పట్ల వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎంఎస్ ప్రసాదరావు, ప్రోవైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కే శివరామకృష్ణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం పోతరాజు అభినందనలు తెలిపారు.