విశాఖపట్నం

జన్మభూమిలో 44 లక్షల పింఛన్ల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, డిసెంబర్ 26: జన్మభూమి- మావూరు కార్యక్రమంలో రాష్ట్రంలో 44 లక్షల మందికి ఫించన్లు పంపిణీ చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. శనివారం తన స్వగృహంలో నియోజకవర్గ స్థాయి సమన్వయకమిటీ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పనితీరును సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనవరి 2 నుండి జరుగనున్న జన్మభూమి - మావూరు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. జన చైతన్యయాత్రల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆయా గ్రామాలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను మంజూరు చేసేందుకు నివేదికలు సమర్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని సూచించారు. అర్హులకు, నిజమైన లబ్దిదారులకు రేషన్ కార్డులు , ఇళ్ళు , ఫించన్లు మంజూరు చేయాలని, వీటన్నింటికీ జన్మభూమి కార్యక్రమాన్ని వేదికగామార్చుకోవాలన్నారు. రాష్ట్రంలో 12 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు, 12 లక్షల మందికి వంట గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో 1,500 మందికి ఇళ్ళు మంజూరు చేస్తున్నామని, పురపాలక పరిధిలో 4.8 లక్షల రూపాయలు ఖరీదు చేసే వెయ్యి ఇళ్ళు నిర్మిస్తున్నామన్నారు. భూగర్భజలాలు పెరిగేందుకు అవసరమైన చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు ఎక్కడ చేస్తే ఉపయోగకరంగా ఉంటుందో సూచించాలన్నారు. పొలాల్లో నీరు నిల్వ చేసుకునేందుకు తద్వారాభూగర్భజలాలు పెంచేందుకు 10 సెంట్లు స్థలం సమకూర్చినట్లైతే ఉపాధి హామీ పథకంలో చిన్న చెరువులు ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందన్నారు. ఈసమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ సన్యాసిపాత్రుడు, ఎంపిపిలు సుకల రమణమ్మ, సన్యాసిదేవుడు, సుర్ల సత్యనారాయణ, జెడ్పిటిసిలు తారకవేణుగోపాల్, కరక సత్యనారాయణ,మార్కెట్ కమిటీ చైర్మెన్ లాలం అబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

సీలేరులో చలితీవ్రత
సీలేరు, డిసెంబర్ 26: జికె వీధి మండలం సీలేరులో రెండు రోజులుగా చల్లని గాలలు వీస్తూ విపరీతంగా చలి పెరిగిపోయింది. దీంతో ఈ ప్రాంతంలో ప్రజలు గజగజ వణికి పోతున్నారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుండి మంచు ప్రభావం అధికం కావడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో విపరీతమైన చలి పెరిగిపోవడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. శనివారం ఉదయం తొమ్మిది గంటల వరకు మంచు తెరలు కమ్ముకుని రహదారులు , గ్రామం కనిపించకుండా పోయింది. ఇటువంటి సంఘటనలతో సీలేరు ప్రజలు ఆందోళనకు గురవుతూ వణుకుతున్నారు. శనివారం సుమారు 18 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా శనివారం సాయంత్రం ఐదు గంటలకు 10 డిగ్రీలకు పడిపోయింది. దీంతో చలి మరింత పెరిగిపోయి వృద్ధులు, చిన్నారులు చలికి వణికి పోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా చలి పెరిగిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈనేపధ్యంలో సీలేరు పంచాయతీలో స్వీపర్‌గా పని చేస్తున్న రాములు చలికి తాళలేక శుక్రవారం రాత్రి మృతి చెందాడు.
సీలేరులో పర్యాటకుల తాకిడి
వరుస సెలవు దినాలు కావడంతో సీలేరులో మంచు అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల నుంచి పర్యాటకులు సీలేరు ప్రాంతానికి చేరుకుని ఇక్కడి అందాలను ఆస్వాదించారు. జల విద్యుత్ కేంద్రం, రిజర్వాయర్‌లను సందర్శిస్తున్నారు. సీలేరు నుంచి లంబసింగి , చింతపల్లి అరకు తదితర ప్రాంతాలకు వెళ్ళేందుకు పర్యాటకులు వచ్చినప్పటికీ లంబసింగిలో వసతి సౌకర్యం లేకపోవడంతో సీలేరులోనే మకాం వేస్తున్నారు. దారకొండ, దారాలమ్మ ఆలయం, వాటర్ పాల్స్, చింతపల్లి కాఫీ తోటలు తదితర వాటిని సందర్శించి మంత్రముగ్ధులవుతున్నారు. సీలేరును పర్యాటకంగా తీర్చిదిద్దితే బావుటుందని పర్యాటకులు చెబుతున్నారు. అధికారులు స్పందించి సీలేరు , లంబసింగి ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.

పదునెక్కిన పోరాటాలతో ముందుకు
* శ్రామిక హక్కుల పరిరక్షణకు ఉద్యమించాలి
* సీపీఐ 90వ వార్షికోత్సవ సభలో జేవీ సత్యనారాయణమూర్తి
విశాఖపట్నం, డిసెంబర్ 26: రానున్న రోజుల్లో చట్టాల సవరణకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పదునెక్కిన పోరాటాలతో ముందుకు సాగాలని, శ్రామిక హక్కుల పరిరక్షణకు ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవీ సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. శనివారం పార్టీ 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద జరిగిన బహిరంగసభకు సీపీఐ నగర కార్యదర్శి దేవరకొండ మార్కేండేయులు అధ్యక్షత వహించారు. సభనుద్దేశించి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ స్వాతంత్య్రానికి ముందు, తరువాత సీపీఏ పోరాట చరిత్ర దేశ ప్రజలకు తెలుసునన్నారు. కార్మికులను, రైతులను ప్రజలను సంఘటితం చేసి దోపిడీలేని సమాజం కోసం 90 ఏళ్ళుగా సీపీఏ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాడిందన్నారు. 90 ఏళ్ళుగా అనేక రాజకీయ పార్టీలు వచ్చి పోయాయని, కానీ చరిత్ర కలిగిన రాజకీయపార్టీగా సీపీఐ దేశ ప్రజల మన్ననలు పొందిందన్నారు. పరిపూర్ణ స్వాతంత్రం కోసం దేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం ఎంతోమంది కమ్యూనిస్టుయోధులు, కార్యకర్తలను కోల్పోయి పార్టీవర్గ లక్ష్యం కోసం పనిచేసిందన్నారు. దేశంలో మతం పేరుతో జరుగుతున్న హింసలను తిప్పికొట్టే విధంగా ప్రజలు సన్నద్ధం కావాల్సిన ఆవశ్యకత నేడు ముందున్న కర్తవ్యమన్నారు. కులం, మతం పేరుతో మోదీ ప్రభుత్వం ప్రజలను, లౌకికవాదాన్ని మంట కలిపే విధానాలను అనుసరిస్తుందన్నారు. దీనికి వ్యితిరేకంగా పోరాటం చేసేందుకు కమ్యునిస్టుపార్టీపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. భూ సంస్కరణల చట్టాన్ని తెచ్చింది కమ్యూనిస్టుపార్టీలేనన్నారు. ఇటు రాష్ట్రంలో చంద్రబాబు ఎయిర్‌పోర్టులు, రాజధాని నిర్మాణం పేరిట వ్యవసాయ భూములను లాక్కొని రైతులను నిరాశ్రయులను చేస్తున్నారన్నారు.
నగరంలో భారీ ర్యాలీ
తొలుత సరస్వతీపార్కు నుంచి జగదాంబ జంక్షన్ మీదుగా జీవీఎంసి గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ జరిగింది. పార్టీ కార్యకర్తలు ఎర్రజెండాలు ప్రదర్శిస్తూ కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు సీహెచ్ రాఘవేంద్రరావు, జేవీ ప్రభాకర్, ఏ.విమలతో పాటు జిల్లా కార్యదర్శి ఏజే స్టాలిన్, జిల్లా కార్యవర్గసభ్యులు అల్లు బాబురావు, పైలా ఈశ్వరరావు, వైఎస్.్భద్రం, జి.వామనమూర్తి, ఎస్.కుమారి, డి.సత్యాంజనేయ, బి.వెంకట్రావు, ఏపీ మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.నందన్న, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, ఏఐఎస్‌ఎఫ్ ఏయూ విభాగం నాయకులు ఎస్.లోవరాజు, మహిళా సమాఖ్య నగర అధ్యక్షులు ఎంఏ భేగం తదితరులు పాల్గొన్నారు.