విశాఖపట్నం

బీచ్ కోత నివారణకు పోర్టు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 16: బీచ్ కోత నివారణకు విశాఖ పోర్టుట్రస్టు (వీపీటీ) చర్యలు తీసుకుంటోందని చైర్మన్ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. బీచ్‌రోడ్డు కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం వద్ద శుక్రవాం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాతావరణంలో చోటుచేసుకునే మార్పులతో పాటు పోర్టులు, పరిశ్రమల ఏర్పాటుతో బీచ్ కోతకు గురవుతోందన్నారు. దీన్ని అరికట్టేందుకు సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యుపీఆర్‌ఎస్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) సూచనతో తీరంలో ఇసుక మేటలు వేస్తున్నట్టు వెల్లడించారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ద్వారా సముద్ర గర్భం నుంచి ఇసుక తీసి, తీరంలో డిపాజిట్ చేయడం ద్వారా కోత నివారణకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇసుక డిపాజిట్ పనులు ప్రారంభించగా, మార్చి వరకూ పనులు కొనసాగుతాయన్నారు. సుమారు మూడు లక్షల క్యూబిక్ మీటర్ల మేర తీరంలో ఇసుక డిపాజిట్ చేయనున్నట్టు వెల్లడించారు. దీనికోసం వీపీటీ రూ.18.37 కోట్లు వెచ్చిస్తోందన్నారు. గతేడాది ఇదే సీజన్‌లో 1.51 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తీరంలో ఇసుక డిపాజిట్ చేశామన్నారు. అయితే తీరం కోతను శాశ్వతంగా నిరోధించేందుకు నెదర్లాండ్స్‌కు చెందిన డెల్టారిస్ సంస్థ అధ్యయనం చేస్తోందన్నారు. ఈ ఏడాది జనవరిలో డెల్టారిస్ సంస్థ అధ్యయనం ప్రారంభించిందని, వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి నివేదిక ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఎటువంటి చర్యలు చేపడితే బీచ్ కోతను నియంత్రించగలమన్న అంశాలను, ఇంజనీరింగ్ సలహాలను నివేదికలో పేర్కొంటుందన్నారు. దీనికి సుమారు రూ.150 కోట్ల వరకూ వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. కోత నివారణకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయం అందించనుందని, మిగిలిన మొత్తాన్ని సమీకరించుకునేందుకు యత్నిస్తున్నామన్నారు.