విశాఖపట్నం

25లోపు 1.42 లక్షల మరుగుదొడ్లు పూర్తికావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 16: జిల్లాలో ఇంకా నిర్మించాల్సి ఉన్న లక్షా 42వేల 594 మరుగుదొడ్లను ఈ నెల 25వ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మరుగుదొడ్ల నిర్మాణం, జియోట్యాగింగ్ పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైదాన ప్రాంతంలో 63వేల 865, ఏజెన్సీ ప్రాంతంలో 78వేల 729 మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉందన్నారు. అయితే తరచుగా సమీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ నిర్మాణపనులు మందకొడిగా సాగుతున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. 28వేల 113 మరుగుదొడ్లకు ఇంకా జియోట్యాగింగ్ పనులు పూర్తిచేయాల్సి ఉందన్నారు. నిర్ణీత కాలవ్యవధిలో మరుగుదొడ్ల నిర్మాణాలు, జియోట్యాగింగ్ పనులు పూర్తికాకుంటే అందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ పనులన్నింటినీ సకాలంలో పూర్తిచేసేలా రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్మాణాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్‌గా ఉన్నారని, తరచుగా సమీక్షిస్తున్నారన్నారు. సకాలంలో పనులు అన్ని పూర్తిచేసి విశాఖను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. జెడ్‌పీసీఇఓ జయప్రకాష్ నారాయణ్, డ్వామా పీడి కళ్యాణ చక్రవర్తి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ మెహర్ ప్రసాద్, డిపీఓ కృష్ణవేణి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.