విశాఖ

‘సాగరమాల’ పనులు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 16: గాజువాక-గంగవరం-అచ్యుతాపురం మధ్య చేపట్టనున్న సాగరమాల ప్రాజెక్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులతో ఆయన శుక్రవారం సాగరమాల ప్రాజెక్ట్‌పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సాగరమాల ప్రాజెక్ట్ సాగే మార్గంలో నాలుగు రోడ్ల వెడల్పునకు సంబంధించి అలైన్‌మెంట్ పనులు పూర్తయ్యాయని అన్నారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించి బిడ్డింగ్ కూడా పూర్తయిందని అన్నారు. ఎంపీ అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ సాగరమాల ప్రాజెక్ట్ మూడు నియోజకవర్గాల మీదుగా వెళుతున్నందున ఆ ప్రాంతంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. జిరాయితీ భూములు, ఇళ్లకు సంబంధించి నష్టపరిహారాన్ని చెల్లించాలని సూచించారు.
నేషనల్ హైవే ఆఫ్ ఇండియా, ఆల్‌మన్‌డ్జ్ గ్లోబల్ ఇన్‌ఫ్రా కన్సల్టెంట్ లిమిటెడ్ సంయుక్తంగా చేపడుతున్న సాగరమాల ప్రాజెక్ట్ వివరాలను పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. ప్రాజెక్ట్‌కు సంబంధించి 725/200 కిలో మీటర్ల పొడవు రోడ్డు వడ్లపూడి జంక్షన్ వద్ద నుంచి మొదలై, అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్ వరకూ వెళుతుందని అన్నారు. ఇది మొత్తం 43 కిలో మీటర్ల రోడ్డని వారు చెప్పారు. దీన్ని మూడు ప్యాకేజీలుగా విభజించినట్టు వారు తెలియచేశారు. ఈ ప్రాజెక్ట్‌లో ప్రైవేటు, స్టీల్‌ప్లాంట్, రైల్వే, గంగవరం పోర్టు, వుడా, ఏపీ ఎస్‌ఈజెడ్, గ్రామ పంచాయతీ భూమి, హెచ్‌ఎస్‌పిసీఎల్ తదితరాలకు సంబంధించిన 238.57 హెక్టార్ల భూమి అవసరమవుతుందని అన్నారు. రోడ్ల విస్తరణ సుమారు 17 గ్రామాల మీదుగా సాగుతుందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా అనకాపల్లి-ఆనందపురం ఆరు లైన్ల నిర్మాణ పనులకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందచేయాలని జాతీయ రహదారుల శాఖ స్పెషల్ డిప్యూటి కలెక్టర్ సుబ్బరాజును కలెక్టర్ ఆదేశించారు. భూ సేకరణకు సంబంధించి ఎటువంటి సమస్యలు లేని గ్రామాల నుంచ పనులు మొదలుపెట్టాలని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కలెక్టర్‌కు సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రజలతో మాట్లాడి, సమస్యలు పరిష్కరించిన అనంతరం పనులు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ సృజన, హైవై ప్రాజెక్ట్ డైరక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.