విశాఖ

వైసీపీకి లీడర్ కావాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 16: విశాఖ జిల్లా వ్యాప్తంగా పార్టీ వైసీపీ బాధ్యతలను చూసుకునేందుకు ఒక నాయకుడు కావాలి. గత ఎన్నికల్లో స్వయంకృతాపరాధం వలన పార్టీ విజయావకాశాలను దూరం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ విజయకేతనాన్ని ఎగరవేయాలంటే, పార్టీలో ఇప్పుడున్న నాయకత్వం సరిపోదన్నది వాస్తవం. సాధారణ ఎన్నికలకు ఒక సంవత్సరానికి మించి సమయం లేదు. అధికార పార్టీకి ఉన్న వ్యతిరేక ఓటును క్యాష్ చేసుకోవలసిన ప్రతిపక్ష పార్టీ ఆ దిశగా ఆలోచన చేయడం లేదన్నది విశాఖ నేతలను చూస్తే అర్థమవుతోంది. ప్రభుత్వ లోపాలను వేలెత్తి చూపి, ప్రజలకు దగ్గరవ్వడానికి జిల్లాలో ఒకరిద్దరు నాయకులు తప్ప, వేరెవ్వరూ ప్రయత్నించడం లేదు. విజయనగరం జిల్లాకు బొత్స సత్యనారాయణ, శ్రీకాకుళం జిల్లాలకు ధర్మాన ప్రసాదరావు నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి విశాఖ జిల్లాకు వచ్చేప్పటికి జిల్లా బాధ్యతలు చూసే ఒకే ఒక్క నాయకుని పేరు చేప్పమంటే ఎవరి పేరు చెప్పాలో తెలియక క్యాడర్ అయోమయస్థితిలో ఉన్నారు. విశాఖ జిల్లా పార్టీ వ్యవహరాలను విజయసాయిరెడ్డి చూస్తున్నారు. అయితే, ఆయన జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నందువలన జిల్లా వ్యవహారాలపై పెద్దగా దృష్టిపెట్టలేకపోతున్నారు. దీన్ని ఆసరగా తీసుకుని, కో-ఆర్డినేటర్లు, జిల్లా నేతలు ఎవరికివారు స్వతంత్రులుగా పనిచేస్తున్నారు.
ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు అనేక అవకాశాలు ఉన్నా, వైసీపీ నేతలు మాత్రం అవేవీ తమకు పట్టవని మిన్నకుంటున్నారు. ఉదాహరణకు మత్స్యకారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాన్ని వైసీపీ క్యాష్ చేసుకోలేకపోయింది. మత్స్యకారులు ఎక్కువగా ఉన్న దక్షిణ నియోజకవర్గం నుంచే ఈ విషయమై ఆందోళన చేపట్టాల్సిన నాయకులు ఎందుకు వౌనంగా ఉండిపోయారు? ఈ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా మారుతోందని ఆ పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. అలాగే ఉత్తర నియోజకవర్గంలో ముగ్గురు కో-ఆర్డినేటర్లను నియమించడం వలన అక్కడ పార్టీ పరిస్థితి కుక్కలు చించిన విస్తరగా మారింది. తూర్పు నియోజకవర్గంలో పార్టీ పరంగా కార్యకలాపాలు పెద్దగా జరగడం లేదు. పశ్చిమ నయోజకవర్గంలో కూడా అదే పరిస్థితి ఉంది. గాజువాక నియోజకవర్గంలో అభ్యర్థి విషయంలో రకరకాల పుకార్లు రావడంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది. పెందుర్తి నియోజకవర్గంలో ఇప్పుడున్న కో-ఆర్డినేటర్‌ను మార్చాలన్న ప్రతిపాదనలు అధిష్ఠానం వద్ద ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. దీనివలన పార్టీ కోసం పనిచేసే వారు కూడా అయోమయానికి గురవుతున్నారు. భీమిలి నియోజకవర్గంలో అక్కరమాని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే, ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గుడివాడ అమర్ కానీ, బోత్స బంధువు చిన్న శ్రీను కానీ పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. దీనివలన ఈ నియోజకవర్గంలో కూడా అనిశ్ఛిత పరిస్థితి నెలకొంది. అదేవిధంగా పాడేరు నియోజకవర్గం నుంచి గిడ్డి ఈశ్వరి వెళ్లిపోయిన తరువాత, అక్కడ పార్టీ నాయకత్వ బాధ్యతలను ఎవ్వరికీ అప్పచెప్పలేదు. అనకాపల్లి క్యాడర్‌ను అక్కడి నాయకులు అయోమయానికి గురి చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూపోతే, జిల్లాలో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా వైసీపీ పటిష్ఠంగా కానీ, కనీసం బలంగా కానీ ఉందని చెప్పలేకపోతున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లాలో అనేక సమీకరణలను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాల్సిన పార్టీ ఇప్పటికీ మీనమేషాలు లెక్కపెడుతోంది. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి మంచి బలం ఉంది. అక్కడ పూర్తి స్థాయిలో ఒక కో-ఆర్డినేటర్‌ను నియమించి, ఆయన పనితీరు బాగుంటే, టిక్కెట్ ఇస్తామన్న భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వ్యవహారాన్ని సమీక్షించే నాయకత్వం జిల్లాలో లేదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకుల కనుసన్నలలో విశాఖ నేతలు పనిచేస్తున్నారన్నది నిజం. జిల్లా పార్టీలో అనేక లొసుగులు, సమన్వయ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నా, చర్యలు తీసుకునేందుకు నాయకులు లేరు. వచ్చే ఎన్నికల్లో ఫలానా నియోజకవర్గంలో పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని చెప్పే పరిస్థితులు లేవు. ఈ స్థితి నుంచి బయటపడాలంటే, పూర్తి స్థాయిలో జిల్లా పార్టీ కోసం పనిచేసే నాయకుడు కావాలి. ఆ దిశగా అథిష్ఠానం ప్రయత్నిస్తే బాగుంటుంది.