విశాఖపట్నం

23న ఉప రాష్టప్రతి రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 16: ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు ఈనెల 23న నగరానికి రానున్నారు. 23వ తేదీ మధ్యాహ్నం ఆయన ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకుని, నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో విశ్రాంతి తీసుకుంటారు. 24 ఉదయం స్థానిక ఏపీఐఐసీ గ్రౌండ్స్‌లో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆయన అదే రోజు తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళతారు.

నాలుగేళ్ల బాలుడికి డెంగ్యూ
* కె.జి.హెచ్.లో చికిత్స
కె.డి.పేట, ఫిబ్రవరి 16: మండలంలో ఎ. ఎల్.పురం ఎస్సీ కాలనీలో నాలుగేళ్ళ బాలుడికి డెంగ్యూ సోకింది. వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆ బాలుడికి స్థానికంగా వైద్య పరీక్షలు చేయగా విశాఖ తరలించాలని డాక్టర్లు తెలియజేసారు. దీంతో ఆ బాలుడిని గాజువాకలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేసి వైద్య సేవలందించారు. అక్కడ కూడా వ్యాధి నిర్ధారణ కాకపోవడంతో కె.జి.హెచ్.లో తరలించారు. అక్కడ చేసిన పరీక్షల్లో బాలుడికి డెంగ్యూగా నిర్ధారణైంది. దీంతో సమాచారం తెలిసిన డి. ఎం.అండ్.హెచ్. ఓ. రమేష్ ఎ. ఎల్.పురం గ్రామానికి వైద్య సిబ్బందిని పంపించి బాలుడికి డెంగ్యూ సోకిన ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించి, తక్షణమే స్ప్రేయింగ్ చేపట్టాలన్నారు. ఈమేరకు అసిస్టెంట్ మలేరియా అధికారి వరహాలు దొర శుక్రవారం సాయంత్రం ఇక్కడ ఎ. ఎల్.పురం కాలనీని పరిశీలించి డెంగ్యూ సోకిన జయవర్ధన్ (4) ఇంటితో పాటు పరిసర ప్రాంతాలను స్ప్రేయింగ్ చేయించారు. డి. ఎం. అండ్.హెచ్. ఓ. ఆదేశాల మేరకు ఈప్రాంతంలో రెండు రోజుల పాటు స్ప్రేయింగ్ చేస్తున్నట్లు ఎ. ఎం. ఓ. వరహాలు దొర తెలిపారు. డెంగ్యూ సోకిన ఈ గ్రామంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. దోమల నివారణకు ఇళ్ళలో స్ప్రేయింగ్ చేయించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఈయన వెంట పలువురు అధికారులు పాల్గొన్నారు.